EPAPER

Blood Donation : ఆపద వేళ కదిలిన యువతరం.. రక్తదానం చేసేందుకు ఆస్పత్రుల వద్ద బారులు..

Blood Donation : ఆపద వేళ కదిలిన యువతరం.. రక్తదానం చేసేందుకు ఆస్పత్రుల వద్ద బారులు..

BLOOD DONATION : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికులు మానవత్వాన్ని చూపించారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.


బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో దాదాపు 900 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. చాలామంది యువకులు శుక్రవారం రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వద్ద వచ్చారు. రక్తదానం చేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నారు. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు వేగంగా స్పందించారు. ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తాము దాదాపు 300 మందిని కాపాడామని స్థానికులు తెలిపారు.


ఘటనాస్థలిలో సైన్యం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తోంది. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 200 అంబులెన్స్‌ లను అందుబాటులో ఉంచారు. ఇందులో 167 .. 108 వాహనాలు , 20 ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. 45 మొబైల్‌ హెల్త్‌ బృందాలు ఘటనాస్థలంలోనే సేవలు అందిస్తున్నాయి.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Big Stories

×