EPAPER

Rememory : మరిణించిన వారితో మాట్లాడవచ్చు.. అదే ‘రీమెమోరీ’..

Rememory : మరిణించిన వారితో మాట్లాడవచ్చు.. అదే ‘రీమెమోరీ’..


Rememory : ఒకసారి ఊపిరి అనేది ఆగిపోయిన తర్వాత.. ఒకసారి మనిషి లేదా ఏదైనా ప్రాణి ప్రాణం విడిచిన తర్వాత మళ్లీ వారిని బ్రతికించడం సాధ్యమా..? అసాధ్యమే కదా.. అయినా కూడా శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఒకసారి మరణించిన మనిషికి తిరిగి ప్రాణం పోయాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు దీనికోసం ఏఐ సాయం తీసుకోనున్నారు.

మనిషి జీవితంలో ఏది కోల్పోయినా కూడా తిరిగి సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ తమకు దగ్గరయిన మనిషిని పోగొట్టుకుంటే మాత్రం.. వారిని మళ్లీ వెనక్కి పొందలేరు. కానీ శాస్త్రవేత్తలు అలా మరణించిన వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. పలు ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ పనిని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ కంపెనీలు.. తమకు దూరమయిన ప్రేమించే వారితో తిరిగి మాట్లాడే అవకాశాన్ని అందించనున్నాయి. అది కూడా ఏఐ సాయంతో.


ఎవరైతే తాము ప్రేమించిన వారిని కోల్పోయి.. తీవ్రమైన బాధలో ఉన్నారో.. వారికి ఈ టెక్నాలజీ అనేది ఒక వరంగా మారనుందని దీని గురించి విన్నవారు అనుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి పని చేయడం నైతికంగా కరెక్ట్ కాదని పలువురు నిపుణులు ఖండిస్తున్నారు. ఒకసారి మనం కోల్పోయిన మనిషిని ఏం చేసినా తిరిగిరారు. కానీ ఈ టెక్నాలజీ అనేది వారికి కోల్పోయిన మనిషి యొక్క కంఫర్ట్‌ను తిరిగి అందించనుంది. ఈ టెక్నాలజీ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎన్నో స్టార్టప్స్‌లో ముందుంది ‘డీప్‌బ్రెయిన్ ఏఐ’. ఇక ఈ టెక్నాలజీకి ‘రీమెమోరీ’ అనే పేరుపెట్టారు.

చనిపోయిన మనిషిని స్టడీ చేస్తూ.. దానికి ఒక డిజిటెక్ రెప్లికాను క్రియేట్ చేయనుంది డీప్‌బ్రెయిన్ ఏఐ. వారు కొత్తగా ఎలాంటి డిజిటల్ కంటెంట్‌ను క్రియేట్ చేయకుండా ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండేవారో స్టడీ చేసి.. దానికి తగినట్టుగా టెక్నాలజీని క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. వారు బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, చేసిన పనులను స్టడీ చేసి వాటిని మాత్రమే రీక్రియేట్ చేస్తాం తప్పా.. కొత్త కంటెంట్‌ను సృష్టించము అని డీప్‌బ్రెయిన్ చెప్తోంది. డీప్‌బ్రెయిన్‌తో పాటు మరెన్నో స్టార్టప్ కంపెనీలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవ్వనున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్టేటస్ అనేది ఎలా ఉంది అని తెలియకపోయినా.. మార్కెట్లోకి ఇది రాగానే కచ్చితంగా సెన్సేషన్ అవుతుందని కంపెనీలు నమ్ముతున్నాయి.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×