EPAPER

PIN Code : పిన్ కోడ్‌లో ఆరు అంకెలే ఎందుకు..?

PIN Code : పిన్ కోడ్‌లో ఆరు అంకెలే ఎందుకు..?

PIN Code : నేడు మన అందరం కూడా డిజిటల్ సముద్రంలో మునిగితేలుతున్నాం. తంతితపాల వ్యవస్థను పూర్తిగా మరచి.. ఉత్తరాలను పంపుకోవడం పూర్తిగా మానేశాం. అయినప్పటికీ పోస్టల్ వ్యవస్థ నుంచి మాత్రం మనం తప్పించుకోలేం. టెక్ యుగంలో పోస్టల్ కోడ్ అవసరం తగ్గలేదు.. సరికదా ఇంకాస్త పెరిగింది.


దేశానికి మొదటగా పిన్ కోడ్ అమలు చేయాలనే ఆలోచన శ్రీరామ్ భికాజీకి వచ్చింది. ఆయన కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేశాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పిన్ కోడ్‌ను 1972 ఆగస్టు 15న ప్రవేశపెట్టారు.

PIN Code


దీని ఆధారంగానే దేశంలోని రాష్ట్రాలను, ఆయా రాష్ట్రాలలోని జిల్లాలను ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా గుర్తించొచ్చు. పర్టిక్యులర్ పోస్ట్ ఆఫీస్‌కు కూడా ఐడెంటీఫై చేయొచ్చు. ఇంత పెద్ద దేశాన్ని ఆరు అంకెల డిజిటల్ పిన్‌తో సమర్థవంతంగా వ్యవహరిస్తుండటం చిన్న విషయమేమి కాదు.

దేశాన్ని మొత్తం 9 పోస్టల్ జోన్లగా విభజించారు. ఈ 9వ నెంబర్‌ జోన్ కేవలం ఇండియన్ ఆర్మీకి సంబంధించినది. కాబట్టి 8 జోన్లనే పరిగణలోకి తీసుకుంటారు. పిన్‌కోడ్‌లోని ఆరు అంకెల్లో మొదటి అంకె పోస్టల్ జోన్‌ను సూచిస్తుంది. రెండో అంకె సబ్ జోన్‌ను లేదా ఉప ప్రంతాన్ని, మూడో అంకె జిల్లాను, చివరి మూడు అంకెలు సమీపంలోని పోస్ట్ ఆఫిస్‌ను సూచిస్తాయి.

దేశంలోని 1,2 నంబర్ జోన్లు నార్త్ జోన్లు. 3,4 జోన్లను వెస్ట్ జోన్లుగా పిలుస్తారు. 5,6 జోన్లను సౌత్ జోన్లు అంటారు. 7,8 జోన్లను ఈస్టర్న్ జోన్లుగా పేర్కొన్నారు. 9వ జోన్ పూర్తిగా ఆర్మీది. ప్రస్తుతానికి 19, 101 పిన్ కోడ్లు కొనసాగుతున్నాయి. వాటి పరిధుల్లో 1,54,725 పోస్టాఫీసులున్నాయి.

  • జోన్ 1 – ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీఘర్
  • జోన్ 2- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
  • జోన్ 3- రాజస్థాన్, గుజరాత్, డామన్-డయ్యూ, దాద్రా నాగర్ హవేలీ
  • జోన్ 4- ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా
  • జోన్ 5 – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, యానాం (పుదుచ్చేరి జిల్లా)
  • జోన్ 6 – కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం తప్పించి), లక్షద్వీప్
  • జోన్ 7 – పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు
  • జోన్ 8 – బీహార్, జార్ఖండ్
  • జోన్ 9 – ఇండియన్ ఆర్మీ

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×