EPAPER

Dogs urinate : కుక్కులు వాహనాల టైర్లపై మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయో తెలుసా..!

Dogs : జీవాల్లో అత్యంత విశ్వాసమైన జంతువుగా కుక్కకు మంచి గుర్తింపు ఉంది. మనతో కలిసి జీవించే ఈ కుక్కలు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తాయి. మనం నేర్పించే పనులు నేర్చుకుంటాయి. రాబోయే ప్రమాదాలను వాసనతో గుర్తించి ముందుగానే హెచ్చరిస్తాయి.

Dogs urinate : కుక్కులు వాహనాల టైర్లపై మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయో తెలుసా..!

Dogs urinate : జీవాల్లో అత్యంత విశ్వాసమైన జంతువుగా కుక్కకు మంచి గుర్తింపు ఉంది. మనతో కలిసి జీవించే ఈ కుక్కలు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తాయి. మనం నేర్పించే పనులు నేర్చుకుంటాయి. రాబోయే ప్రమాదాలను వాసనతో గుర్తించి ముందుగానే హెచ్చరిస్తాయి. కొన్ని రకాలైన సంకేతాలతో ప్రకృతి వైపరిత్యాలను గుర్తిస్తాయి. అందుకే కుక్కలను ఇళ్లలో పెంచుకోవటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వీటికి లక్షలు పోసి కోనేవాళ్లు ఉన్నారు.


అయితే కుక్కలు ఎక్కువగా మూత్ర విసర్జన టైర్లపై, గోడలపై విద్యుత్ స్తంభాలపై చేయడం మనం చూస్తునే ఉంటాం. మన వాహనంపై అవి మూత్రం పోసినప్పుడు తీవ్రమైన అసహనం కలుగుతుంది. వాహనాన్ని మొత్తం కడిగి శుభ్రం చేస్తాం. అసలు అలా చేయటానికి కారణం తెలుసా?

కామన్‌‌గా మనం మాటలు ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటాం. మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలనే ఉన్నాయి సాధనాలు. కానీ జంతువులు మాట్లాడలేవు. అందుకే అవి కమ్యూనికేట్ కోసం ప్రత్యేక మార్గాన్ని అనుకరిస్తాయి. వాటిలోని జాతులను బట్టి వాటి కమ్యూనికేషన్ విధానం ఉంటుంది.


మనం నిత్యం వాహనాలపై అనేక ప్రదేశాలకు వెళ్తుంటాము. ఈ కార్లు లేదా బైకులు ఏవైనా సరే.. ప్రయాణించేప్పుడు వాటి టైర్లు అనేక ప్రదేశాలకు వెళ్తాయి. ఆయా ప్రదేశాల్లో ఉండే మట్టి , ఇతర పదార్థాలు టైర్లకు అంటుకుని అపరిశుభ్రంగా తయారవుతాయి. వాటి నుంచి అనేక వాసనలు వస్తుంటాయి. ఆ వాసనలు కుక్కులకు మాత్రమే తెలుస్తాయి. అందుకనే కుక్కలు ఎక్కువగా టైర్లపై మూత్ర విసర్జన చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

భూమిపై మూత్ర విసర్జన చేస్తే అది వెంటనే గాలిలో కలిసిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు వాహనాల, వస్తువుల ఉపరితలంపై కుక్కులు మూత్ర విసర్జన చేస్తాయి. కుక్కలు ఎక్కువగా రబ్బరు వాసనను ఇష్టపడతాయి.అందుకనే టైరు వాసనకు ఆకర్షితులై అక్కడికి వెళ్లి మూత్ర విసర్జన చేసి తిరిగి వస్తుంటాయి. కుక్క మూత్రం వాసన రబ్బరుపై ఎక్కువకాలం ఉంటుంది.

కుక్కలు తిరిగే ప్రదేశాన్ని, నివశించే ఏరియాను ఇతర కుక్కులకు తెలియజేడానికి ఈ పద్ధతులను పాటిస్తాయి. దీని వల్ల అక్కడికి ఏ కుక్క వచ్చినా.. అది అక్కడి సంచారాన్ని గుర్తిస్తుంది. ఇతర కుక్కలు కూడా మూత్రం వాసన గ్రహించి సహచరులను గుర్తిసాయి.

కుక్కలు ఒకసారి ఏదైనా టైరుపై మూత్రం పోసినప్పుడు.. ఆ ప్రదేశాన్ని తమ ప్రదేశంగా మార్కు చేసుకుంటాయి. అందుకునే అవి మూత్రం పోసే ముందు ముక్కుతో వాసన చూస్తాయి. ఇలా కొన్ని వాహనాల టైర్లపై తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటాయి.

అయితే మీ వాహనాలపై కుక్కలు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటే.. టైర్లపై మిరియాలు లేదా కారంపొడి చల్లాలి. దీంతో వాసనపోయి. కుక్కులు మళ్లీ మూత్ర విసర్జన చేయవు. అలానే ఇంట్లో వాడే పెర్‌ఫ్యూమ్ కూడా స్ప్రే చేయవచ్చు. ఈ చిట్కాలతో కుక్కలు వాహనాల టైర్లపై మూత్రం పోయకుండా అడ్డుకోవచ్చు.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×