Big Stories

Diwali Crackers : దీపావళికి టపాసులు కాల్చే సంప్రదాయ ఎప్పుడు మొదలైంది.

Diwali Crackers : ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడ్ని వధించి పదహార వేల మంది కన్యలను విడిపించి ద్వారకాకు తీసుకొని వచ్చాడు. ఆ విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటూ ఉంటాం . ద్వాపర యుగంలో దీపావళికి, కలియుగంలోని బాణా సంచాతో సంబంధం లేదు. వెలుగు జ్ఞానానికి గుర్తు. సంతోషానికి ప్రతీక.

- Advertisement -

క్రీస్తుశకం తొమ్మిదవ శతాబ్దంలో చైనీయులు బాణాసంచాను తయారు చేయటం కనిపెట్టారు. 15వ శతాబ్దం నుంచి ఇది అన్నిదేశాలకు పాకింది. భారతదేశంలో కేవలం ఐదారు వందల సంవత్సరాల నుంచి మాత్రమే బాణా సంచా తయారు చేస్తున్నారు. దీపావళిని జరుపుకోవడంలో ఒక శాస్త్రీయ లాభం ఉంది. ఆశ్వయుజ మాసానికి వర్షాకాలం ముగుస్తుంది. శరదృతువులో జరుపుకునే దీపావళి సమయం నాటికి భూమి నుంచి లక్షలాది కీటకాలు ప్రాణం పోసుకుంటాయి. మనుషులకు, పక్షులకి వీటితో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఈ క్రిమికీటకాల నివారణ కోసమే బాణా సంచా వెలిగించే

- Advertisement -

సంప్రదాయం పుట్టిందని పూర్వీకులు చెప్పారు. బాణా సంచా నుంచి వెలువడే గంధకం పొగకు కంటికి కనిపించని కీటకాలు మనకు తెలియకుండానే నశించిపోతాయి.దీపావళికి దీపాలు వెలిగించటానికి గతకాలంలో ఆముదం నూనెను వాడేవారు. ఇప్పుడైతే రకరకాల నూనెలు వాడేస్తున్నారు. ఆముదపు నూనె నుంచి వచ్చే పొగ, ఆరోగ్యదాయకం. వాతావరణాన్ని ఆముద పొగ శుభ్రపరుస్తుంది. నూనె దీపాలు వెలిగించటం వల్ల కీటకాలు వెలుతురుకి ఆకర్షించబడి నూనె ప్రమిదల్లో పడి చనిపోతుంటాయి. టపాసుల శబ్దానికి కూడా కొన్ని కీటకాలు
నాశమవుతుంటాయి. ఈదీపాలను చాలా మంది కార్తీక మాసం ముగిసే వరకు ప్రతీ రోజు పెడుతుంటారు.

దీపావళి రోజు వచ్చేఅమావాస్యనాడు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ ఆశ్వయుజ పూజచాలా ప్రశస్తమైంది. ఉత్తరభారతీయులందరూ ఈ పండుగను అత్యంతవైభవంగా జరుపుకుంటారు. లక్ష్మీపూజ కోసం కొంత అయినా బంగారం కొనుగోలు చేస్తారు. దుకాణాల్లో లక్ష్మీపూజ చేసి మిఠాయిలు పంచుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News