EPAPER

Is Mirror Broken in House : ఇంట్లో అద్ధం పగిలితే సంకేతమిదే !

Is Mirror Broken in House : ఇంట్లో అద్ధం పగిలితే సంకేతమిదే !

Is Mirror Broken in House : అద్దం పగిలితే అందులో ముఖాన్ని చూసుకోకూడదు. అలాగే ఇంట్లో ఉంచుకోకూడదు.మరకలు పడి లేదా మాసిపోయిన దాన్ని అసలు ఉంచకూడదు. అద్దానికీ, లక్ష్మీదేవికీ అవినాభావ సంబంధం ఉంది.అద్దం లక్ష్మీ స్థానం. అద్దంలో ఎప్పుడూ ఒకటే బొమ్మ నిలిచి ఉండదు. లక్ష్మీ అంతే నిలకడగా ఉండదు.


అద్దం పగిలితే ధన నష్టమని శాస్త్రం చెబుతోంది. గాజు వస్తువు ఏదైనా పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏరినా, శుభ్రపరిచినా ఎక్కడోకక్కడ ఎంత జాగ్రత్తగా ఏరినా , శుభ్రపరిచినా చిన్న చిన్న గాజు ముక్కలు కనిపించకుండా గుచ్చుకుని బాధపడతాయి. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓపికగా వెతికి ఎవరూ నడవని ప్రదేశాల్లో ముక్కల్ని పారేయాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం పెట్టడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. అద్దం ఇంటి అలంకరణ కోసం ఉద్దేశించినప్పటికీ, దానిని సరైన దిశలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలను ఇస్తుంది. అది మీ అదృష్టాన్ని కూడా మార్చగలదు. అద్దాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ఇంటిలోని వాస్తు దోషం తగ్గుతుంది. ఇంట్లో గుండ్రంగా ఉండే అద్దాలు బదులు దీర్ఘచతురస్రాకారపు అద్దాలు ఉంచుకోవాలి. ఇలాంటి అద్దాలు సంపూర్ణ వాస్తును కలిగి ఉంటాయి.


అద్దాలను ఎల్లప్పుడూ ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలపై ఉంచాలి. దక్షిణ లేదా పడమర గోడలపై ఎప్పుడూ ఉంచకూడదు. అద్దం అకస్మాత్తుగా పగిలిపోయింది అంటే దాని అర్థం మన కుటుంబం ఏదో పెద్ద సమస్య నుంచి బయటపడింది, మన ఇంటిలోని పీడ ఏదో తొలగిపోయింది అని అర్థం. అయితే అలా పగిలిన అద్దాన్ని మాత్రం బయటపడేసి వెంటనే ఆ స్థానంలో కొత్త అద్దాన్ని అమర్చుకోవాలి.

Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×