EPAPER

Milk : గేదె పాలు, ఆవు పాల మధ్య తేడా ఏంటి?

Milk : గేదె పాలు, ఆవు పాల మధ్య తేడా ఏంటి?

Milk : మనం తాగే పాలల్లో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ డీ, కాల్షియం అధికంగా ఉంటుంది. మన ఎముకలు, పళ్లను ధృడంగా చేయడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ప్ర‌తిరోజు పాలు తాగాల‌ని వైద్యులు చెబుతుంటారు. అసలు మన ఆరోగ్యానికి ఏ పాలు మంచివి, ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరి సందేహం. పాలలోని కొవ్వుతోనే వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుంది. ఆవు పాల‌ల్లో 3 నుంచి నాలుగు శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. గేదె పాలలో 7 నుంచి 8 శాతం వరకు కొవ్వు ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఆవు పాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. అంతేకాకుండా అవి అరగడానికి కూడా టైమ్‌ పడుతుంది. అంతేకాకుండా ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో 10 నుంచి 11 శాతం వరకు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో వేడి నిరోధ‌క‌త‌ వస్తుంది. న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు గేదె పాలు తాపవద్దని వైద్యులు చెబుతుంటారు. గేదె పాలలో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటాయి. అందుకే ఊబ‌కాయం, ర‌క్త‌పోటు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వీటిని తాగడం ఎంతో మంచిది. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగానే ఇందులో ఉంటాయి. ఒక‌ గ్లాస్ గేదె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటాయి. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయి. గేదె పాల‌లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. కానీ ఆవు పాలను మాత్రం రెండు రోజులలోపే తాగాల్సి ఉంటుంది. గేదె పాలు తెల్లగా, క్రీమ్‌ కలర్‌లో ఉంటాయి. ఆవు పాలు అయితే ప‌సుపు, తెలుపు రంగును కలిగి ఉంటాయి. గేదె పాలలోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే పసుపు రంగు పోతుంది. ఆవు పాలలోనూ బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ మోతాదు మాత్రం తక్కువే. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగాలి. నెయ్యి, పన్నీర్‌, కోవా, పెరుగు, పాయసం చేసుకోవడానికి గేదె పాలు శ్రేష్టమైనవి. స్వీట్లు చేసుకోవాలంటే మాత్రం ఆవు పాలను వాడాలి. రెండింటి మధ్య చాలా తేడా ఉన్నా రెండూ ఆరోగ్యానికి మంచివే, వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, అవసరాన్ని బట్టి ఏ పాలు వాడాలో మనమే నిర్ణయించుకోవాలి.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×