EPAPER

Nirjala Ekadashi : నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఏంటి?

Nirjala Ekadashi : నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఏంటి?


Nirjala Ekadashi : మే 31న నిర్జల ఏకాదశి . ఏడాదిలో వచ్చే 24 ఏకా దశులతో పోల్చితే మే 31న వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. భీముడు ఇదే రోజు ఉపవాసం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భీమసేన ఏకాదశి కూడా పిలుస్తారు. తోడేలుకి ఎంత ఆకలి ఉంటుందో అంత ఆకలి భీముడికి ఉంటుంది. భీమసేనుడు భోజన ప్రియుడని అందరికి తెలుసు. అలాంటి భీముడు శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రకారం ఈ రోజున ఉపవాసం చేయడంతో భీమసేన ఏకాదశి గా పేరు వచ్చింది.

శాస్త్రం ప్రకారం అన్ని ఏకాదశల్లో ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా చేయలేని వారు ఏడాదికోసారి మాత్రమే వచ్చే నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం చేయడంచేయగలిగితే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని విశ్వాసం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం చుక్కనీరు తాగ కుండా ఉండటమే నిర్జలన ఏకాదశి. శ్రీ మహా విష్ణువు ప్రార్ధిస్తూ ఈ ఉపవాసవత్రం పాటిస్తే మానవ జన్మకి మోక్షం కలుగుతుందని నమ్మకం.


జేష్ఠ్య మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మాత్రమే నిర్జల ఏకాదశిగా పిలుస్తారు. మే31న ఏకాదశి రోజున తెల్లవారజామునే స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం పాటించాలి. ఆరాధించాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విశిష్టమైనవి. సకలపాపాలు ఇవాళ చేసే ఉపవాస దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంవత్సరమంతా శ్రీ మహా విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించలేకపోయామని బాధపడే వారు నిర్లల ఏకాదశి నాడు భక్తితో పూజిస్తే ఏడాది పూజా వ్రతం ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. వైద్యశాస్త్రం ప్రకారం కూడా నెలలో ఒక ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పింది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకి ఒక రోజు విశ్రాంతి ఇస్తే మరింత యాక్టివ్ గా క్రియాశీలకంగా పనిచేస్తాయని పరిశోధనలో తేలింది. అలా మనకు మనం మంచి చేసుకోవడం కోసమే పెద్దోళ్లు దేవుళ్ల పేరు చెప్పి ఉపవాసాన్ని మనకి పరిచయం చేశారు.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×