EPAPER
Kirrak Couples Episode 1

Diabetes : షుగర్ వ్యాధి అంటే ఏమిటి.. ? రాకుండా జాగ్రత్తపడటం ఎలా..?

Diabetes : షుగర్ వ్యాధి అంటే ఏమిటి.. ? రాకుండా జాగ్రత్తపడటం ఎలా..?

Diabetes : మధుమేహం లేదా చక్కెర (షుగర్)వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అంటారు. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మన రక్తంలోకి వచ్చే చక్కెర లేదా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం ఎదరైనప్పుడు ఈ సమస్య బారిన పడినట్లు భావిస్తారు. డయాబెటిస్‌కు ప్రధాన కారణం.. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం.


రక్తంలోని చక్కెరలను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల పక్షపాతం, గుండెపోటు, చూపు కోల్పోవడం, కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు .

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ఇది పెరుగుతున్న సమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల ప్రమాదం ఉన్నప్పటికీ.. డయాబెటిస్ ఉన్న వారికి దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులతో డయాబెటిస్‌కు నివారించవచ్చు.


మనం తిన్న ఆహారంలోని కార్బొహైడ్రేట్లను జీర్ణవ్యవస్థ చక్కెరలను గ్లూకోజ్‌గా విడగొడుతుంది. క్రోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ శక్తిని విడుదల చేయడానికి .. ఈ గ్లోకోజ్‌ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుబడి డయాబెటిస్ వస్తుంది.

చక్కెర శరీరానికి ఎంతో అవసరం. ఇది శరీర కండరాలు, కణజాలాలను తయారు చేసే కణాలకు శక్తిని ఇచ్చే ముఖ్యమైన సోర్స్. మెడదుకు కూడా ఇది ప్రధాన ఇంధన వనరు. మీకు ఏ రకమైన డయాబెటిస్ ఉన్నా.. అది మీ రక్తంలో అధిక చక్కెరకు దారితీస్తుంది.

డయాబెటిస్ చాలా రకాలు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డయాబెటిస్‌ను రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ముఖ్యమైనవి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణుల్లో వచ్చే డయాబెటిస్).

టైప్ 1 డయాబెటిస్ : క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతే రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. దీని వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.

ఇలా ఎందుకు జరుగుంతో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. జన్యువుల ప్రభావం, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల క్రోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిని.. ఇలా జరగుతుండొచ్చని భావిస్తున్నారు. డయోబెటిస్ ఉన్న వారిలో 10 శాతం మంది టైప్ 1 డయాబెటిస్ రోగులుంటారు.

టైప్ 2 డయాబెటిస్ : క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ టైప్‌ 2 డయాబెటిస్ వస్తుంది.

మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారు టైప్ 2 బారినపడతారు. దీనికి మరొక ముఖ్య కారణం.. అధిక బరువు, ఎక్కువగా కూర్చునే పనిచేయడం, కనీసం శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ఆసియా దేశాలలో టైప్ 2 మధుమేహం ఎక్కువగా కనిపిస్తుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ : గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు, తల్లికి అవసరమైనంత ఇన్సులిన్‌ను వారి శరీరం ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. సాధారణంగా 6 నుంచి 16 శాతం మంది గర్భిణులు ఈ డయాబెటిస్‌ని ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు అంచనా వేశాయి.

డైట్, వ్యాయామం, వైద్యుల సలహాతో ఇన్సులిన్ తీసుకుంటూ.. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడకుంగా శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి. కానీ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో డయాబెటిస్‌ను నియంత్రించడం సాధ్యమైంది.

కొందరికి ప్రి డయాబెటిస్ అనే పరిస్థితి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణ అవుతుంది. ఇది డయాబెటిస్ రావడానికి ప్రారంభ దశ. ఇది ఇలానే కొనసాగితే మధుమేహానికి కారణం కావచ్చు.

డయాబెటిస్ లక్షణాలు..

  • ఎక్కువగా దాహం వేయడం
  • ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం. ముఖ్యంగా రాత్రి వేళల్లో
  • ఏ పని చేయకపోయినా.. బాగా అలసిపోవడం
  • బరువు ఒక్కసారిగా తగ్గిపోవడం
  • శరీరంపై గాయాలు త్వరగా మానకపోవడం
  • కంటిచూపు స్పష్టంగా లేకపోవడం
  • విపరీతమైన ఆకలి
  • చిగుళ్లు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకడం

టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు చిన్న వయస్సులో లేదా యుక్తవయస్సులో కనిపిస్తాయి. వారిలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.

దక్షిణ ఆసియా దేశాల్లో సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో టైప్ 1 డయాబెటిస్. 25 ఏళ్లు పైబడిన వారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు బ్రిటీష్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది.

కుటుంబంలో లేదా తల్లిదండ్రులలో, తోబుట్టువల్లో ఏ ఒక్కరికైనా ఉన్నా.. మిగిలిన వారికి కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగానే ఉంది.

డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే.. చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలను తీసుకోకూడదు. పాస్తా, వైట్‌బ్రెడ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

రిఫైన్డ్ తృణధాన్యాలు, రిఫైన్డ్ షుగర్‌లో పోషకాలు పెద్దగా ఉండవు. రిఫైన్ చేసే ప్రక్రియలో వాటిలోని విటమిన్లు, పీచు పదార్థాలు కోల్పోతాయి.

తెల్లపిండి, వైట్‌బ్రెడ్, వైట్‌రైస్ వైట్‌పాస్తా, షుగరీ డ్రింక్స్, స్వీట్లు, బ్రేక్‌ఫాస్టు సెరియల్స్, పేస్టీలలో అదనంగా చక్కెరలు చేర్చుతారు.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, ఆరోగ్యకరమైన ఆయిల్స్, గింజలు, ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపల్ని తినొచ్చు.

విరామ సమయంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కడుపు నిండుగా అనిపించగానే తినడం ఆపాలి. వీటితో పాటు శరీరానికి వ్యాయామం చాలా అవసరం. ఇది చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడుతుంది.

బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ ప్రకారం.. వారంలో రెండున్నర గంటల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయాలి. ఇందులో భాగంగా వేగంగా నడవడం. మెట్లు ఎక్కడం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవారు.. గుండె వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కోలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచుకోవాలి. పొగ తాగడం, పీల్చు కోవడం అసలు చేయకూడదు.

వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ ప్రకారం.. డయాబెటిస్ వల్ల 2016లో 16 లక్షల మంచి ప్రాణాలు విడిచారు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2014లో 422 మిలియన్లకు పెరిగింది.

Tags

Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

×