EPAPER

Last Rites : అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?

Last Rites :  అంతిమ సంస్కారాల్లో మొలతాడు ఉండకూడదా..?

Last Rites : మనిషి మరణించిన తర్వాత మొలత్రాడు కూడా వూడబెరికి మట్టి చేస్తారు. లేదా దహనం చేస్తారు. ఎలా వచ్చాడో అలాగే సంస్కారం చేస్తారు. దిగంబరంగా ఈ భూమికి వస్తారు…దిగంబరంగానే వదిలి వెళతారు.


జననం ప్రారంభం, మరణం ప్రారబ్ధం. చావుకీ, పుట్టకకూ మధ్య ఉండే సమయమే జీవిత. పుట్టబట్టలేదు. చావు బట్టలేదు నడుమ ఈబట్టకనగుబాటుకాదుకో అన్నాడు వేమన. దిగంబరుడు వేమన కవి కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు. వేదాంతులకు , సన్యాసులకు బట్టలక్కర్లేదు. వారి ప్రపంచం వేరు. కానీ నాగరిక సమాజంలో నడిచేవాడికి బట్టలు కావాల్సిందే.

దేహాన్ని విడిచిన జీవుడు, మోక్షానికి నడిపించేవి ధర్మ నిష్ట, సత్యదీక్ష. ఈ రెండు మాత్రమే. మనిషి బ్రతికున్నంతకాలం పెళ్లాం, బిడ్డల కోసం అన్యాయం, అక్రమాలు చేసి ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన వ్యక్తిని చూడు. ఈ శవాన్ని చూసైనా తెలివి తెచ్చుక మనిషీ అని చెప్పడం ఈ ఉద్దేశం. భార్య వాకిలిదాకా, కొడుకు కాటి దాకా, మాత్రమే రాగలడు. జీవం లేని దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు మొలత్రాడు కూడా మిగలదు .


మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారం చేయబోయే ముందు స్నానం చేయించి కొత్త బట్ట కడతారు. భూ స్థాపితం లేదా దహనం చేసే టప్పుడు ముందు బట్టలు తొలగించి మొలత్రాడు కూడా తీసివేసి మట్టి చేస్తారు. బతికున్న కాలంలో ఎన్ని పనులు చేసినా ఎంత కూడబెట్టినా మరణించిన తర్వాత మొలత్రాడు కూడా నీకు చెందదని చెప్పడమే ఇందులో ఆంతర్యం.

Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×