EPAPER
Kirrak Couples Episode 1

Virus:-ఆటిజంకు కారణమవుతున్న రెట్రోవైరస్..

Virus:-ఆటిజంకు కారణమవుతున్న రెట్రోవైరస్..

Virus:-టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు చికిత్సలు కనుక్కుంటూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటికీ కొన్ని మానసిక సమస్యలకు చికిత్సను మాత్రం కనుక్కోలేకపోతున్నారు. అంతే కాకుండా అసలు అవి ఎలా అటాక్ చేస్తున్నాయి అన్న విషయాలన్ని కూడా నిర్ధారించలేకపోతున్నారు. అలాంటి వ్యాధుల్లో ఒకటి ఆటిజం. తాజాగా ఆటిజంకు కారణమయ్యే వైరస్ ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.


ఎన్నో న్యూరోడెవలప్మెంట్ సమస్యల్లో ఆటిజం. ఆటిజం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ దీనికి కారణం ఏంటో పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పటివరకు ఐడియోపాథిక్ ఆటిజంపైనే ఎక్కువగా పరిశోధనలు జరిగాయి. ఈ ఐడియోపాథిక్ ఆటిజం అనేది ఎక్కువగా ఎలుకల్లో కనిపిస్తుంటుంది. అందుకే ఇలాంటి ఎలుకలపై ఎక్కువగా పరిశోధనలు జరిగాయి. ఆటిజం అంటే ఏంటో తెలుసుకోవడానికి వారికి ఎలుకలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

తాజాగా మౌస్ మోడల్స్‌లో ఆటిజంపై పరిశోధనలు చేయడానికి ఒక ఇంటర్నేషనల్ టీమ్ సిద్ధమయ్యింది. ఎండోజీనస్ రెట్రోవైరస్ అనేది ఫీటస్‌లో చేరి ఆటిజంకు దారితీస్తుందని వారు గమనించారు. అయితే ఒక్కొక్కసారి ఆటిజం ద్వారా చదవడానికి, రాయడానికి ఇబ్బందులు కూడా ఉండవని, ఆటిజంలో ఇది కూడా ఒక రకమని వారు అన్నారు. ఇదే కోణంలో మరిన్ని పరిశోధనలు చేస్తే ఆటిజం అంటే, అది ఎన్ని విధాలుగా ఉంటుంది, దీనికి ఎలాంటి చికిత్సను అందిస్తే మెరుగ్గా ఉంటుంది అని విషయాలపై క్లారిటీ రానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం మెదడులోని ఎడమ, కుడి హెమీస్ఫియర్‌ను కలిపే కార్పస్ కాల్లోషియమ్‌లో లోపాలు ఉండడం వల్ల ఆటిజం అనేది అటాక్ అవుతుందని తేలింది. జినోమ్ వైరసే దీనికి కారణం అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఆర్ఎన్ఏను స్టడీ చేయడం వల్ల ఈ రెట్రోవైరస్ ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుందని వారు అన్నారు. ఇప్పటివరకు కేవలం జెనటిక్ లోపాల వల్లే ఆటిజం వస్తుందని అనుకున్న శాస్త్రవేత్తలకు జినోమ్ వైరస్ వల్ల ఆటిజంపై ఎఫెక్ట్ పడుతుందని తెలియడం ఈ రీసెర్చ్‌లో ఎన్నో మార్పులకు దారితీయనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పరిశోధనల వల్ల ఆటిజంకు చికిత్స కూడా దొరుకుతుందోమో అని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్వచ్ఛమైన తాగునీటి కోసం పోరాటం..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×