EPAPER

Director Adhyanth Harsha: ‘విరాజీ’ మూవీ గురించి ఆ డీటెయిల్స్ చెప్పేసిన డైరెక్టర్

Director Adhyanth Harsha: ‘విరాజీ’ మూవీ గురించి ఆ డీటెయిల్స్ చెప్పేసిన డైరెక్టర్

Director Adhyanth Harsha: ఆద్యంత్ హర్ష డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘విరాజీ’ వచ్చే నెల 2న విడుదల కానున్నది. ఈ సినిమాను మహా మూవీస్ మరియు ఎమ్ మీడియా పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించారు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా పనిచేశారు. సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సినిమాకు సంబంధించిన హైలెట్స్ గురించి వివరించారు.


‘మాది ఏపీలోని నెల్లూరు. తిరుపతిలో నేను బయెటక్నాలజీలో బీటెక్ పూర్తి చేశాను. ఆ తరువాత ఫారిన్ వెళ్లి అక్కడ బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశాను. అదేవిధంగా అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేశాను. ఆ టైమ్ లోనే మూవీస్ కోసం పది కథలు రాసుకున్నాను. 2019 సంవత్సరంలో నేను ఇండియాకు తిరిగి వచ్చా. అయితే, సినిమా డైరెక్టర్ కావాలనేది నా కల. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్నాను. నా ప్రయాణంలో నా కుటుంబ సభ్యులు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇండియాకు వచ్చాక మూడు షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అదేవిధంగా 37 నిమిషాల నిడివి ఉన్న ఓ ఇండిపెండెంట్ మూవీని కూడా రూపొందించాను. ఆ ఫిల్మ్ నచ్చిన ఒకరు దానిని రూ. 2 లక్షలకు కొనుకున్నారు. దీంతో నాలో కాన్ఫిడెన్స్ లెవల్ మరింతగా పెరిగాయి. గత సంవత్సరం ‘విరాజీ’ సినిమాకు సంబంధించిన కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు వివరించాను. ఆయనే ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కు పరిచయం చేశారు. ఆయనకు ఈ కథను చెప్పడంతో ఆయనకు బాగా నచ్చింది. ఆ తరువాత ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకుంటున్నావ్ అని అడిగారు. నాకు మొదటి నుంచి కూడా ఈ సినిమాకు వరుణ్ సందేశ్ సందేశ్ హీరోగా అనుకున్నా. వెంటనే వరుణ్ ను కలిసి ఆయనకు కూడా ఈ కథను వివరించా. సందేశ్ కు కూడా కథ బాగా నచ్చింది. ఓకే చెప్పడంతో షూటింగ్ ప్రారంభించాం. సినిమాకు సంబంధించి మొత్తం షూట్ పూర్తయ్యాక.. పోస్ట్ ప్రొడక్షన్ కు 4 నెలల సమయం పట్టింది. విరాజీ అంటే చీకట్లో ఉన్నవారికి వెలుగులు నింపేవ్యక్తి. సమాజంలో ఉన్న పలు సమస్యలను తెరపై చూపించాలన్నదే నా ఉద్దేశం. ఈ చిత్రంలో పలు సస్పెన్స్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సినిమాను మీరు థియేటర్లో చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోతారు.

విరాజీ కథ విషయానికి వస్తే.. ఓ 10 మంది కొండపై ఉన్న ఓ ప్లేస్ కు వెళ్తారు. అయితే, అది మూసేసినటువంటి పిచ్చాసుపత్రి అని అక్కడికి పోయినంక వారికి అర్థమవుతుంది. వారంతా బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు కనిపించదు. ఫోన్లలో సిగ్నల్స్ ఉండవు. ఆ టైమ్ లో ఆండీ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను వచ్చాక ఎలాంటి పరిణామాలు జరిగాయన్నదే ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం.


ఈ సినిమాకు ఏబెనైజర్ పాల్ మ్యూజిక్ అద్భుతంగా అందించాడు. ఈ చిత్రంలో విజువల్స్ ఎంత హైలెట్ ఉంటాయో మ్యూజిక్ కూడా అంతే హైలెట్ అవుతాయి. పలువురు సీనియర్ నటులు ఈ సినిమాలో నటించారు.

సినిమా రివ్యూ చూసిన తరువాత హీరో వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా తనకు మరో లైఫ్ ఇస్తుందని పేర్కొన్నాడు. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’ అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×