EPAPER
Kirrak Couples Episode 1

Vasavi Mata :- వాసవి మాత త్యాగానికి సాక్షి అగ్నిగుండం

Vasavi Mata :- వాసవి మాత త్యాగానికి సాక్షి అగ్నిగుండం


Vasavi Mata :- వైశాఖ శుక్ల దశమి నాడు ఏప్రిల్ 30న వాసవి జయంతి . వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. భక్తులను అనుగ్రహించేందుకు అమ్మవారు ఎన్నో రూపాల్లో అవతరించింది. అలాంటి అవతారాల్లో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. ఆర్యవైశ్యులకి (కోమట్లు)కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి కులదేవతగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అమ్మవారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

11వ శతాబ్దంలో కుసుమ శ్రేష్టి, కుసుమాంబ దంపతులకి జన్మించింది వాసమాంబ. కుసుమ శ్రేష్టి వేంగి దేశంలోని వసాల్ అనే ప్రాంతాన్ని పాలించే వాడు.వసాల్ దేశంలో పుట్టడంతో ఆమె వాసవి అయిది. కన్యా రాశిలో జన్మించడం వల్ల కన్యక అయింది. వాస్తవ దేవిని పూజించేవారిని శ్రేష్టులు అంటారు.


పెనుగొండ ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యదార్ధగాధకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లగా అగ్నిగుండం నిలుస్తోంది. ఏటా వేల సంఖ్య భక్తులు ఆ క్షేత్రం సందర్శిస్తూఉంటారు.

రెండేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో 90 అడుగుల ఎత్తైన వాసవి మాత పంచలోహ విగ్రహం భక్తులకు అభయం ఇస్తూ దర్శనమిస్తూ కనిపిస్తుంది. దేశంలో అతిపెద్ద ఎత్తైన అమ్మవారి స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. అటు తమిళులు, ఇటు తెలుగువారు కూడా ఈ ఆలయాన్ని ఎంతో భక్తిప్రపత్తులతో దర్శిస్తుంటారు.

Related News

Surya Grahan 2024: నేడే చివరి సూర్య గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాలి

Horoscope 2 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Engilipoola Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసింది, పువ్వులు ఎలా ఎంగిలి అవుతాయో తెలుసుకోండి

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Big Stories

×