Uses of hand kerchief? : మీ హ్యాండ్ కర్చీఫ్ ఎల్లప్పుడూ మీరే వాడాలి. వేరే ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే ఇతరుల కర్చీఫ్‌లు తీసుకోకూడదు. ఎందుకంటే వారి కర్చీఫ్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది. మీరు దేని గురించైనా మరిచిపోయినప్పుడు మీ హ్యాండ్ కర్చీఫ్‌ను ముడి వేసి పెట్టి అలాగే వదిలేయండి. అది మీరు మరిచిపోయిన దాన్ని త్వరగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. మీ హ్యాండ్ కర్చీఫ్‌లపై పెన్సిల్, స్కెచ్‌లు , పెన్నులు వంటి వాటితో రాయద్దు. అలా చేస్తే.. మీలో ఉన్న ఏకాగ్రత, పట్టుదల పోతాయట.
ముదురు రంగుల్లో ఉన్న చేతి రుమాళ్లు వాడకూడదు. ఎల్లప్పుడూ లేత రంగుల్లో తయారు చేసిన హ్యాండ్ కర్చీఫ్లనే వాడాలి. ఎందుకంటే డార్క్ కలర్స్ రాహువు, కేతువు, శని, కుజుడు వంటి గ్రహాలను ప్రతిబింబిస్తాయట. వాటితో మనకు చాలా హాని జరుగుతుందట. కనుక హ్యాండ్ కర్చీఫ్‌లను వాడడంలో ఈ జాగ్రత్తలను తీసుకుంటే.. లాభాలను పొందవచ్చు.
కాటన్, సిల్క్‌తో తయారు చేసిన హ్యాండ్ కర్చీఫ్ వాడితే మంచిది. ఇది మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే కర్చీఫ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం లేదంటే మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. తెలుపు రంగులో ఉన్న హ్యాండ్ కర్చీఫ్‌ను దగ్గర పెట్టుకుంటే మీలోకి ఎల్లప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. దీంతో అంతా శుభమే జరుగుతుంది. చంద్రుడి శుభదృష్టి మీపై పడుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.
అలాగే చేతి రుమాలు కూడా డబ్బు చెల్లించకుండా ఉచితంగా ఇతరుల నుంచి తీసుకోకూడదు. చాలా మంది ఇతరుల రుమాలు కాసేపు వినియోగించి తిరిగి ఇవ్వడం మర్చిపోతుంటారు. కాబట్టి మీ వద్ద ఇతరుల రుమాలు ఉన్నప్పుడు వెంటనే తిరిగి ఇవ్వండి. ఇలాంటి చిన్న విషయమే ఇరువురు మధ్య ప్రేమను తగ్గిస్తుంది. ఎవరి నుంచి అయితే రుమాలు తీసుకున్నారో వారితో మీ సంబంధం నెమ్మదిస్తుంది. అంతేకాకుండా శత్రుత్వం పెరుగుతుంది. అంతేకాదు ఎప్పుడూ బహుమతిగా కర్చీఫ్ లు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి