EPAPER
Kirrak Couples Episode 1

Twitter : నీ దానికన్నా నాదే బెటర్!

Twitter : నీ దానికన్నా నాదే బెటర్!

Twitter : ఈ మాట అన్నది ఎవరో కాదు… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ దేని విషయంలో మస్క్ దానికన్నా నాదే బెటర్ అని ట్రంప్ అన్నాడో తెలుసా! ట్విట్టర్‌కన్నా తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’ చాలా అద్భుతంగా ఉందంటున్నాడు… ట్రంప్.


హింసను ప్రేరేపించారన్న కారణంతో 2021 జనవరి 8న ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ నిషేధం విధించింది. ఆ సమయానికి ఆయనకు 88 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అకౌంట్ బ్యాన్ చేయడంతో ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ట్రంప్‌కు 29 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా… ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో… డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించే ఆలోచన చేస్తున్నామని మస్క్ ప్రకటించాడు. ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా? వద్దా? అని ట్విట్టర్‌లో పోల్ కూడా నిర్వహించాడు. ఇందులో పాల్గొన్న 15 మిలియన్ల మందిలో… 51.8 శాతం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించాలని కోరారు. దాంతో… ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను యాక్టివేట్ చేశాడు… మస్క్.

అయితే ట్రంప్ మాత్రం తనకు ట్విట్టర్ తో పనిలేదు పొమ్మన్నారు. పోల్‌ ముగియడానికి కొన్ని గంటల ముందే… తనకు ట్విట్టర్‌లోకి తిరిగి రావాలని లేదని చెప్పి మస్క్‌కు షాక్ ఇచ్చారు. ట్విట్టర్‌ ఖాతాను మళ్లీ ఉపయోగించడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు… ట్రంప్. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘ట్రూత్ సోషల్’ చాలా అద్భుతంగా ఉందని, ట్విట్టర్‌ కంటే ఎక్కువ ఫీచర్స్ అందులో ఉన్నాయని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. ట్విట్టర్లో బాట్, నకిలీ ఖాతాల వంటి సమస్యలు చాలా ఉన్నాయన్న ట్రంప్… ట్రూత్ సోషల్‌లో అలాంటి ఇబ్బందులేవీ లేవని స్పష్టం చేశారు. ట్రంప్‌కు చెందిన ఐటీ కంపెనీ అభివృద్ధి చేసిన ‘ట్రూత్ సోషల్‌’కు 20 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.


Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×