EPAPER

TikTok:-టిక్‌టాక్‌తో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎడ్యుకేషన్..

TikTok:-టిక్‌టాక్‌తో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎడ్యుకేషన్..

TikTok:-ఈరోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత చెడు చేస్తుందో.. అంతే మంచి చేస్తోంది కూడా. టెక్నాలజీ అందించే విజ్ఞానాన్ని గ్రహిస్తే మాత్రం.. విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటారు. అందుకే ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్న ప్రతి టెక్నాలజీలో ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే కోణంలో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ యాప్స్ ద్వారా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు.


టిక్‌టాక్ అనేది పలు దేశాల్లో బాన్ అయిపోయింది. దీని బ్యాన్ వెనుక పలు కారణాలు కూడా ఉన్నాయి. కానీ పలు దేశాల్లో మాత్రం ఇది ఇంకా మోస్ట్ యూజ్డ్ యాప్‌లాగా చలామణి అవుతోంది. అందుకే దీని సాయంతోనే యూజర్లకు సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన అందించాలని, సైన్స్ అండ్ టెక్నాలజీని దగ్గర చేయాలని అనుకుంటున్నారు టెక్ నిపుణులు. అంతే కాకుండా ఇంకెన్నో విషయాలను తెలుసుకోవడానికి కూడా టిక్‌టాక్‌ను ఉపయోగించే విధంగా మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

టిక్‌టాక్ అనేది అతిపెద్ద సైన్స్ కమ్యూనిటీ, సోషల్ నెట్‌వర్కింగ్‌లోనే ఇది ఒక కొత్త సంచలనంగా మారింది. దీని తర్వాత ఎన్నో సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ వచ్చినా కూడా ఇప్పటికీ అదే ఉన్నతస్థాయిలో ఒకటిగా ఉంది. అందుకే ఎక్కువమంది యూజర్లను అట్రాక్ట్ చేసిన టిక్‌టాక్.. ఇప్పుడు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్)లో యూజర్లకు కొంత విజ్ఞానాన్ని కూడా అందించాలనుకుంటోంది. స్టెమ్ కేటగిరిలో కొన్ని వీడియోలను టిక్‌టాక్ ప్రచారం చేయనుంది.


ఇప్పటికే టిక్‌టాక్ ద్వారా ఎంతో మిస్ ఇన్ఫర్మేషన్ ప్రచారం అవుతుందని చాలామంది దృష్టిలో ఈ యాప్ నెగిటివ్‌గా మారిపోయింది. అందుకే స్టెమ్ కేటగిరిలో అలాంటి మిస్ ఇన్ఫర్మేషన్ ఏదీ ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పైగా ఈ కేటగిరిలో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే స్టెమ్ రూల్స్‌ను పాటించాలని టిక్‌టాక్ అంటోంది. అయితే ఈ రూల్స్‌ను దాటితే.. వీడియో ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తామని టిక్‌టాక్ హెచ్చరిస్తోంది. ఇప్పటినుండి టిక్‌టాక్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎడ్యుకేషన్‌ కూడా అందిస్తోందిన యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌.. సర్జరీ లేకుండానే చికిత్స..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×