Big Stories

Human Brain : మనిషి మెదడులో జ్ఞాపకాలు ఎలా స్టోర్ అవుతాయంటే..?

Human Brain : మనిషి తయారు చేసిన టెక్నాలజీ తిరిగి మనిషినే పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. కానీ మనుషులను స్టడీ చేసే టెక్నాలజీలను తయారు చేయడం అంత సులువు కాదంటున్నారు నిపుణులు. మనిషి మెదడును స్టడీ చేయడానికి పలు కంప్యూటర్ మోడల్స్ ఉపయోగపడతాయి. కానీ ఈ కంప్యూటర్ మోడల్స్ వెనుక కష్టమైన టెక్నాలజీ దాగి ఉంటుందని వారు చెప్తున్నారు. తాజాగా దీని గురించి మరికొన్ని విషయాలు బయటపెట్టారు.

- Advertisement -

మనిషి మెదడులో జ్ఞాపకాలను ఎలా తయారు చేస్తుంది, వాటిని ఎలా జాగ్రత్తగా పొందుపరుస్తుంది అనే విషయాలను తెలుసుకోవడానికి పలు కంప్యూటర్ మోడల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ ఆ మోడల్స్‌ను తయారు చేయడం చాలా కష్టమని పరిశోధకులు చెప్తున్నారు. బయోకెమికల్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కలిసి న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ఏర్పాటు అయినప్పుడు మెదడులో జ్ఞాపకాలు స్టోర్ అవుతాయని వారు గమనించారు. న్యూరోసైంటిస్టులకు మెదడు యొక్క కదలికలు పూర్తిగా అర్థమయినా కూడా దానిని కంప్యూటర్ మోడల్‌లోకి మార్చి స్టడీ చేయడమే కష్టమైన పని.

- Advertisement -

మెదుడను స్టడీ చేసే సులువైన కంప్యూటర్ మోడల్‌ను కొందరు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే హాప్ఫీల్డ్ నెట్‌వర్క్. ఇది కేవలం మెదడులోని న్యూరాన్ సెల్స్ ఎలా కనెక్ట్ అయ్యుంటాయో తెలుసుకోవడమే కాకుండా ఎక్కువ జ్ఞాపకాలను పొందుపరచడానికి ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది మరింత రియలిస్టిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. బయోలజీ అనేది కష్టంగా ఉండడానికి మెదడులోని మెమోరీ స్టోరేజ్ స్టడీ కూడా ఒక కారణం అయ్యి ఉంవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

హాప్ఫీల్డ్ నెట్‌వర్క్ అనేది మెమోరీస్‌ను ప్యాటర్న్ లాగా మార్చి గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మెమోరీస్‌ను గుర్తుపెట్టుకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను ప్రత్యేకంగా ట్రైన్ చేయనున్నారు. ఇప్పటికే హాప్ఫీల్డ్ అనే నెట్‌వర్క్ మెదడును స్టడీ చేసే కంప్యూటర్ మోడల్స్‌లో ఒకటిగా ఉంది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ నెట్‌వర్క్ మునుపటి దానికి అప్డేటెడ్ వర్షన్‌లాగా పనిచేయనుంది. ఇప్పటికే సింప్లికల్ హాప్ఫీల్డ్ నెట్‌వర్క్ పేరుతో దీని గురించి ఇతర న్యూరోసైంటిస్టులకు శాస్త్రవేత్తలు వివరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News