EPAPER
Kirrak Couples Episode 1

Top 5 IT Companies:ప్రపంచవ్యాప్తంగా ఐటీలో టాప్ 5 సంస్థలు ఏంటంటే..

Top 5 IT Companies:ప్రపంచవ్యాప్తంగా ఐటీలో టాప్ 5 సంస్థలు ఏంటంటే..

Top 5 IT Companies:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అనేది కేవలం దేశాన్నే కాదు.. ప్రపంచం రూపురేఖలనే మార్చేసింది. టెక్ రంగంలో ఇతర ప్రపంచ దేశాలతో భారత్‌ను పోటీపడేలా చేసేలా ముందుకు నడిపించింది ఐటీ రంగమే. అయితే ప్రపంచంలో పేరున్న ఐటీ కంపెనీలు చాలావరకు ఇతర దేశాల్లోనే ఉన్నా.. అందులో కొన్నింటికి భారతీయులే వ్యూహకర్తలుగా వ్యవహరించడం దేశానికి గర్వకారణం. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిభగల ఉద్యోగులను తయారు చేస్తున్న ఐటీలో టాప్ 5 కంపెనీలు ఏంటంటే..


  1. మైక్రోసాఫ్ట్
    ప్రపంచంలో ఉన్న ఎన్నో ఐటీ కంపెనీల్లో టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్, పాల్ ఏలెన్ కలిసి 1975లో ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్‌ను లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వంటి ఫీచర్స్‌ను ప్రపంచంలో దాదాపు ప్రతీ ఐటీ ఉద్యోగి ఉపయోగిస్తున్నవే. కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లాగా ప్రారంభమయిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు ఎన్నో సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్‌కు ప్రాణం పోసింది. అభివృద్ధిని సాధిస్తున్న సమయంలోనే ఎన్నో ఇతర కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. లింక్డ్ ఇన్, స్కైప్ వంటి టెక్ సంస్థలు ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సొంతం. ఈ సంస్థ హెడ్‌క్వార్టర్స్ వాషింగ్టన్‌లోని రెడ్మండ్‌లో ఉంది. 2018లోనే 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న మైక్రోసాఫ్ట్.. 2020 నుండి 2021లో 17 శాతం లాభాలను చూసింది.
  2. ఐబీఎమ్
    ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (ఐబీఎమ్) అనేది అమెరికన్ కంపెనీ అయినా.. 150 దేశాల్లో దీని సర్వీసులను జరుపుతోంది. కంప్యూటింగ్ అండ్ రికార్డింగ్ కంపెనీ పేరుతో మొదలయిన ఈ సంస్థ.. 1924లో ఐబీఎమ్‌గా పేరు మార్చుకుంది. న్యూయార్క్‌లోని ఆర్మాంక్‌లో ఈ సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉంది. క్లౌండ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, డేటా అనాలటిక్స్, ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ విభాగాల్లో ఐబీఎమ్ ఎక్కువగా పనిచేస్తోంది. థామస్ వ్యాట్సన్ సీనియర్ ఐబీఎమ్‌ను స్థాపించినట్టుగా తెలుస్తోంది. ప్రతీ సంవత్సరం తన బిజినెస్‌ను మెరుగుపరుస్తున్న ఐబీఎమ్.. చాలా లాభాలను కూడా మూటగట్టుకుంటోంది. సంవత్సరానికి 57 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే టాప్ 2 ఐటీ కంపెనీగా పేరు తెచ్చుకుంది ఐబీఎమ్.
  3. ఆక్సెంచర్
    ఫ్యార్చున్ 500 గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఆక్సెంచర్ పేరుతెచ్చుకుంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల్లో ఈ సంస్థ తనదైన ముద్రవేసుకుంది. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఆక్సెంచర్ తన సేవలను అందిస్తోంది. ముందుగా ఒక అకౌంటింగ్ కంపెనీలో భాగంగా ఆర్థూర్ ఆండర్సన్ ఈ సంస్థను ప్రారంభించారు. 1989లో ఆ అకౌంటింగ్ కంపెనీ నుండి విడిపోయి.. దీనిని ఒక టెక్ కంపెనీగా మార్చారు ఆండర్సన్. ప్రపంచవ్యాప్తంగా ఆక్సెంచర్‌లో 6,99,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 నుండి ఆక్సెంచర్.. ప్రపంచలోనే టాప్ 3 ఐటీ కంపెనీగా స్థానం దక్కించుకుంటూ వస్తోంది. ఐర్‌ల్యాండ్‌లోని డుబ్లిన్‌లో ఆక్సెంచర్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఏడాదికి 51 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటోంది ఈ సంస్థ.
  4. ఒరాకిల్
    క్యాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ షోర్స్‌లో ఒరాకిల్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. పేరున్న అమెరికా మల్టీ నేషనల్ కంపెనీల్లో ఒరాకిల్ కూడా ఒకటి. పూర్తిగా సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి లాభాలు సంపాదిస్తున్న కంపెనీల లిస్ట్‌లో మైక్రోసాఫ్ట్ తర్వాత స్థానంలో చోటు దక్కించుకుంది ఒరాకిల్. ఈఆర్‌పీ సొల్యూషన్స్, డేటాబేస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, సప్లై ఛైన్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ వంటి సేవలను యూజర్లకు అందజేస్తోంది ఈ సంస్థ. ప్రస్తుతం 150కు పైగా దేశాల్లో ఒరాకిల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 1,35,000 మంది ఉద్యోగులతో సంస్థ నడుస్తోంది. ఎప్పటికప్పుడు ఇబ్బందులను తొలగిస్తూ.. కస్టమర్లు ఆకట్టుకోవడంలో ఒరాకిల్ ముందుంటుంది. ప్రస్తుతం ఏడాదికి 40 బిలియన్ డాలర్ల ఆదాయం ఒరాకిల్ సొంతం.
  5. ఎస్‌ఏపీ
    సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ఇతర సర్వీసులను యూజర్లకు అందించడానికి ఎస్‌ఏపీ ఎంతగానో కృషిచేసింది. 88,000 మంది ఉద్యోగులతో దాదాపు 130 పైగా దేశాల్లో ఎస్ఏపీ ఆపరేట్ చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ మ్యానుఫ్యాక్చరర్‌లో ఎస్ఏపీ కూడా ఒకటి. టెక్నోలజీ ఇన్నోవేషన్ విషయంలో ఎస్ఏపీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొత్త కొత్త టెక్నాలజీలను అందించడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఎస్ఏపీ హానా పేరుతో బిజినెస్ సమస్యలను పరిష్కరించడానికి ఓ కొత్త టెక్నాలజీ కూడా ఏర్పాటయ్యింది. జర్మనీలోని వాల్డార్ఫ్‌లో ఈ సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఏడాదికి 32 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఎస్ఏపీ ముందుకెళ్తోంది.


Tags

Related News

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Big Stories

×