EPAPER
Kirrak Couples Episode 1

Artemis : ఆర్టెమిస్‌ తొలి చిత్రం.. తొలిసారి చంద్రుడు నుంచి భూమి ఫోటో

Artemis : ఆర్టెమిస్‌ తొలి చిత్రం.. తొలిసారి చంద్రుడు నుంచి భూమి ఫోటో

Artemis : నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఓరియన్‌ క్యాప్సుల్‌ చంద్రుడి ఉపరితలంపై 81 మైళ్ల ఎత్తులో దూసుకెళ్లి.. పెద్దకక్ష్యలోకి ప్రవేశిస్తోంది. ఇది గంటకు 5,102 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో 34 నిమిషాలపాటు భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఎందుకంటే చంద్రుడికి అవతలవైపు ఈ ప్రక్రియ జరగడంతో ఇలా జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆర్టెమిస్‌-1 విజయవంతమైందని నాసా ప్రకటించింది. అక్కడి నుంచి తీసిన చిత్రాలను ఒరియన్‌ క్యాప్సుల్‌ పంపింది. ఈ ఫోటోలో భూమి చిన్న నీలం చుక్కలా కనిపిస్తోంది.


ఒరియన్‌ పంపిన సెల్ఫీలను ఇటీవల నాసా షేర్‌ చేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలి స్పేస్‌ క్యాప్సుల్‌ చంద్రుడి మీదకు వెళ్లింది. రెండునెలలపాటు వాయిదాపడిన నాసా ఆర్టెమిస్‌-1 ప్రయోగం ఎట్టకేలకు గత బుధవారం మొదలైంది. సాంకేతిక లోపాలను సరిదిద్ది ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను ప్రయోగించారు.


Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×