EPAPER

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Telangana Tehsildars transfer: ఎట్టకేలకు రాష్ట్రంలో తహసీల్దార్ల తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకే తిరిగి వెళ్లిపోయే విధంగా అవకాశం కల్పించాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ మొదటి నుంచి చేసిన కృషికి ఫలితం దక్కింది. దీంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న చూపులకు తెర పడింది.


అయితే, ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ వంటి ఉన్నతాధికారులను టీజీటీఏ అధికారులు ఇప్పటికే కలిశారు. ఇందులో భాగంగానే ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను సైతం అందజేశారు. అలాగే ఇదే విషయంపై ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సమావేశంలో చర్చించారు. దీంతో ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. అనంతరం బదిలీలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీజీటీఏ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మహిళా అధ్యక్షురాలు రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్,సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్ లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హత, అవకాశం, ఆసక్తి ఉన్న ప్రతి తహసీల్దార్ కు ట్రాన్స్ ఫర్ అవకాశం కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు.


Also Read:  ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

అయితే, ఎన్నికల బదిలీల విషయంలో చాలా ఆలస్యం జరిగిందని, బదిలీ అయిన ప్రతీ తహసీల్దార్ కు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా ప్రతీ తహసీల్దార్ కు బదిలీ అవకాశం కల్పించేందుకు టీజీటీఏ కృషి చేస్తుందని వెల్లడించారు.

Related News

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Big Stories

×