EPAPER

India Defeated Nepal by 82 Runs: నేపాల్‌పై భారత్ ఘన విజయం

India Defeated Nepal by 82 Runs: నేపాల్‌పై భారత్ ఘన విజయం

India defeated Nepal by 82 Runs: మహిళల టీ20 ఆసియాకప్ మెగా టోర్నీలో భారత్ దూసుకెళ్తోంది. టోర్నీలో భాగంగా నేపాల్ తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీస్ కు రీచ్ అయ్యింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. 179 పరుగుల లక్ష్య ఛేదనకు ప్రయత్నించిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 96 పరుగులు తీసింది. ఓపెనర్ గా గ్రౌండ్ లోకి దిగిన సీతా రానా మాగర్ 18 పరుగులు తీశారు. ఇటు భారత బౌలర్లు నేపాల్ ప్లేయర్లు పరుగులు తీసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, రధా యాదవ్, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. రేణుక సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.


Also Read: కేంద్ర బడ్జెట్.. క్రీడలకు ఎప్పటిలా అవే నిధులు

అయితే, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు తీసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (81 – 48 బంతుల్లో ఒక సిక్స్, 12 ఫోర్లు), హేమలత (47- 42 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లు) పరుగులు తీశారు. నేపాల్ బౌలర్లు.. సీతారాన మగర్ 2 వికెట్లు తీయగా, కబితా జోషి ఒక వికెట్ పడగొట్టింది.


ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతూ వచ్చింది. తొలి ఓవర్ లోనే రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు తీశారు. ఓ వైపు నేపాల్ బౌలర్లు విరుచుకుపడుతున్నా.. బౌండరీల మోత మోగించారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

తాజా విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. నేపాల్, యూఏఈ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×