Big Stories

Black Holes : అంతరిక్షంలో వింత ఆకారాలు.. బ్లాక్ హోల్స్ నుండి..

- Advertisement -

Black Holes : అంతరిక్షం గురించి ఆస్ట్రానాట్స్ ఎంత స్టడీ చేసినా.. ఇంకా వారికి తెలియని ఎన్నో మిస్టరీలు అందులో దాగి ఉంటాయి. అందుకే వారు ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. అందరికీ తెలియజేస్తారు. మిల్కీ వే, సోలార్ సిస్టమ్.. వీటన్నింటిలో ఏదో ఒక కొత్త వింత దాగి ఉంటుంది. తాజాగా మిల్కీ వేలో పలు వింత ఆకారాలను చూసినట్టుగా ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. అసలు అవి ఏంటి అని తెలుసుకోవడం కోసం వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

- Advertisement -

గ్యాలక్సీలో పలు బ్లాక్ హోల్స్ లాంటివి ఆస్ట్రానాట్స్‌కు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అయితే గ్యాలక్సీ మధ్యలో ఉన్న అలాంటి ఒక బ్లాక్ హోల్ నుండి ఫిలమెంట్స్ లాంటివి విడుదల అవుతున్నాయని వారు గమనించారు. ఈ రకరకాల ఫిలమెంట్స్.. వింత ఆకారాలకు వారికి టెలిస్కోప్‌లో కనిపిస్తున్నాయని బయటపెట్టారు. ఈ ఫిలమెంట్స్ ద్వారా బ్లాక్ హోల్ గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆస్ట్రానాట్స్ అభిప్రాయపడుతున్నారు.

ముందుగా బ్లాక్ హోల్స్ నుండి ఇలాంటి ఫిలమెంట్స్ విడుదల కావడం 40 ఏళ్ల క్రితం జరిగిందని ఆస్ట్రానాట్స్ గుర్తుచేసుకున్నారు. తాజాగా ఆస్ట్రానాట్స్ గమనించిన ఫిలమెంట్స్ అనేవి 5 నుండి 10 లైట్ ఇయర్స్ అంత పెద్దగా ఉన్నట్టుగా తెలిపారు. కానీ 40 ఏళ్ల క్రితం గమనించిన ఫిలమెంట్స్ అనేవి 150 లైట్ ఇయర్స్ పెద్దగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఫిలమెంట్స్ అన్నింటిని కలిపి చూస్తే.. అచ్చం మార్స్ కోడ్ లాగా ఉంటుందని అన్నారు. బ్లాక్ హోల్ నుండి ఒకేసారి ఇన్ని ఆకారాలు బయటికి వెళ్తూ, వస్తూ ఉండడం అనేది చూసి ఆశ్చర్యపోయామని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు.

రేడియో ఆస్ట్రానమీ టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. ఇలా అంతరిక్షంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటపడడం అనేది రేడియో ఆస్ట్రానమీకి చాలా ఉపయోగకరంగా మారుతుందని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. ఇప్పటికీ ఈ ఫిలమెంట్స్ గురించి పెద్దగా సమాచారం లేకపోయినా.. వీటి గురించి, వీటితో పాటు బ్లాక్ హోల్స్ గురించి పరిశోధనలు చేయడానికి ఆస్ట్రానాట్స్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఏదైనా యాక్టివిటీ వల్ల ఈ ఫిలమెంట్స్ అనేవి ఏర్పడి ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News