EPAPER
Kirrak Couples Episode 1

IPOs : ఊరించాయి.. ఉన్నదంతా ఊడ్చేశాయి!

IPOs : ఊరించాయి.. ఉన్నదంతా ఊడ్చేశాయి!

IPOs : రూ.1,50,000 కోట్లు.. అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలు.. ఇదీ గత 16 నెలల్లో ఐపీవోకు వచ్చిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్లు పోగొట్టుకున్న సంపద విలువ. కొన్న ధరతో పోలిస్తే కొన్ని కంపెనీల షేర్ల విలువ ఏకంగా 75 శాతానికి పైగా పడిపోవడంతో… ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. లిస్టింగ్ అవగానే షేరు ధర వంద శాతం పెరిగిన కంపెనీల్ని చూసి ఆశపడి, వచ్చిన ప్రతీ ఐపీవోల్లోనూ ఇన్వెస్ట్ చేస్తే… కొన్న కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయని, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదని సగటు మధ్యతరగతి ఇన్వెస్టర్ బావురుమంటున్నాడు.


కరోనా ప్రపంచాన్ని కబళించబోతోందన్న ఆందోళనతో… 2020 ఆరంభంలో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఏకంగా మూడో వంతు పడిపోయాయి. మళ్లీ అక్కడి నుంచి సూచీలు లేస్తాయా? లేదా? అనుమానంతో చిన్న ఇన్వెస్టర్లు అటువైపు చూడనే లేదు. ఇదే అదనుగా బడా ఇన్వెస్టర్లు తక్కువ స్థాయిల దగ్గర షేర్లు కొనడంతో… స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. కొత్త శిఖరాలను తాకుతూ దూసుకెళ్లాయి. దాంతో చిన్న ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశ మొదలైంది. అయితే గరిష్ట స్థాయిల దగ్గర నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో… ఐపీవోల వైపు చూశారు. కరెక్ట్ టైమ్ లో జనం క్రేజ్ ని క్యాష్ చేసుకున్నాయి… అనేక కంపెనీలు. తమ కంపెనీల వాస్తవ విలువకు కొన్ని రెట్లు అధికంగా ఆఫర్ ధర నిర్ణయించి… జనం నుంచి సొమ్ము రాబట్టాయి. కొన్ని కంపెనీలకు అనూహ్య స్పందన వచ్చి ఓవర్ సబ్ స్క్రైబ్ కాగా… మరికొన్ని ముక్కుతూ, మూలుగుతూ వందశాతం సబ్ స్క్రైబ్ సాధించగలిగాయి. ఇక అప్పటి నుంచి మొదలైంది… చిన్న ఇన్వెస్టర్ల నష్టాల పరంపర.

ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చిన సంస్థ గురించి చెప్పుకోవాలంటే… పేటీఎం మొదటి స్థానంలో నిలుస్తుంది. దీని ఆఫర్ ధర రూ.2,150. లిస్టింగ్ టైమ్ నుంచి ఇది నష్టాల్లోనే ఉంది. ప్రస్తుతం రూ.500లకు కాస్త అటూఇటూగా ఉంది పేటీఎం షేరు ధర. అంటే ఏకంగా 75 శాతానికిపైగా పడిపోయింది. ఇక నైకా ఆఫర్ ధర రూ.1,125. లిస్టింగ్ లో ఏకంగా వంద శాతం పెరిగి అదరగొట్టింది… నైకా. చాలా మంది రెట్టింపు లాభానికి అమ్ముకుని షేర్లను వదిలించుకుంటే… కొందరు మాత్రం ఇంకా పెరుగుతుందని ఆశపడి గరిష్ట ధర దగ్గర నైకా షేర్లు కొన్నారు. ఆ తర్వాత నుంచి నష్టాలబాట పట్టిన నైకాను గట్టెక్కించడానికి… సంస్థ బోనస్ షేర్లను ప్రకటించింది. కానీ, పతనం మాత్రం ఆగలేదు. లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిశాక యాంకర్‌ ఇన్వెస్టర్లు నైకా షేర్లను తెగనమ్మడం మొదలుపెట్టడంతో… మూడు రోజుల్లోనే 20 శాతానికిపైగా నష్టపోయింది. ఆఫర్ ధరతో పోలిస్తే ఇప్పటికీ నైకా 15 శాతానికి పైగా నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జొమాటో గురింది. ఐపీఓలో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ.76కు దొరికింది. బంపర్ లిస్టింగ్ తర్వాత అది రెట్టింపు స్థాయికి కూడా వెళ్లింది. దాంతో అక్కడ చాలా మంది షేర్లు అమ్ముకుని లాభపడ్డారు. అక్కడి నుంచి మొదలైన జొమాటో పతనం… రూ.40 స్థాయికి కూడా చేరింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా… ఇంకా ఆఫర్ ధరకు పది శాతం దిగువనే ట్రేడవుతోంది. దాంతో… గరిష్ట స్థాయి దగ్గర జొమాటోషేరు కొన్న వాళ్లు… దాని ధర టొమాటో స్థాయికి పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలబాదుకుంటున్నారు. పాలసీ బజార్‌ షేర్‌ కూడా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. ఇక ఎల్‌ఐసీ షేర్‌ కూడా ఆఫర్ ధరతో పోలిస్తే 30 శాతానికి పైగా పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే జనం సొమ్మును కరిగించేసిన ఐపీఓలు ఎన్నో ఉన్నాయి. ఫండమెంటల్స్‌, బ్యాలెన్స్‌ షీట్స్‌ను పట్టించుకోకుండా పెట్టుబడి పెట్టడం ఇన్వెస్టర్ల నష్టానికి ఒక కారణమైతే… నష్టాల్లో ఉన్న కంపెనీల ఐపీవోకు కూడా సెబీ అనుమతివ్వడం మరో కారణం.


Related News

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Big Stories

×