EPAPER
Kirrak Couples Episode 1

Sparrows : పిచ్చుకమ్మా.. ఎక్కడున్నావమ్మా..!

Sparrows : పిచ్చుకలు.. కిచకిచామంటూ సందడి చేస్తూ ఒకనాడు పల్లె ముంగిళ్లలో, పంటచేలల్లో, ధాన్యపు రాశుల్లో సందడి చేసేవి గ్రామాల్లోని ఇండ్ల ముంగిట గుంపులుగుంపులుగా వాలటం ఏదో ఒక అలికిడి వినగారే తుర్రుమని ఎగిరిపోవడం దృశ్యాలు చూడముచ్చగా ఉండేవి. పెంపుడు పక్షలు కాకపోయనా ఇవి పూరిళ్ల చూరలలో, మన ఇళ్ల చుట్టూ గూళ్లను ఏర్పాటు చేసుకునేవి. ఇవి దిగుడు బావులలో వేలాడుతూ చెట్లపై కట్టే గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి.

Sparrows : పిచ్చుకమ్మా.. ఎక్కడున్నావమ్మా..!

Sparrows : పిచ్చుకలు.. కిచకిచమంటూ సందడి చేస్తూ ఒకనాడు పల్లె ముంగిళ్లలో, పంటచేలల్లో, ధాన్యపు రాశుల్లో సందడి చేసేవి గ్రామాల్లోని ఇండ్ల ముంగిట గుంపులుగుంపులుగా వాలటం ఏదో ఒక అలికిడి వినగానే తుర్రుమని ఎగిరిపోయే దృశ్యాలు చూడముచ్చగా ఉండేవి. పెంపుడు పక్షులు కాకపోయనా ఇవి పూరిళ్ల చూరలలో, మన ఇళ్ల చుట్టూ గూళ్లను ఏర్పాటు చేసుకునేవి. ఇవి దిగుడు బావులలో వేలాడుతూ చెట్లపై కట్టే గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి.


కానీ నేడు మన సౌలభ్యం కోసం పెరుగుతున్న టెక్నాలజీ పిచ్చుకల పాలిట శాపంగా మారింది. వృక్ష సంపద తగ్గిపోవటం, వ్యవసాయంలో రసాయన మందుల వినియోగం, గ్రామాల్లో, పట్టణాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయడం, ఒక్కొకరు రెండేసి సిమ్ కార్డులు వాడటం తదితర కారణాలతో పిచ్చుకలు ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి.

పూర్వం గోనె సంచుల్లో ధాన్యం నిల్వ చేయగా.. పిచ్చుకలు వాటిని పొడుచుకొని తినేవి. రైతులు కూడా పిచ్చుకల కోసం వరిని కుచ్చులుగా కట్టి వేలాడదీసేవారు. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ కంటైనర్, గోడౌన్లలో ధాన్యం నిల్వలు చేయడంతో పిచ్చుకలకు ఆహారం దొరకడం లేదు. రైతులు వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల పిచ్చుకల నాడీ వ్యవస్థ దెబ్బతిని 21 జాతులు అంతరించిపోయాయి.


పిచ్చుకలు 85 శాతం బతికినంత కాలం ఒకే ఆడపిచ్చుకతో కలిసి జీవిస్తాయి. దాంపత్య జీవితానికి చాలా విలువనిస్తాయి. సృష్టిలో అధిక సంతానోత్పత్తిని విస్తారంగా చేయగలిగే సామర్థ్యం వీటిసొంతం. ఏడాదికి పిచ్చుకలు నాలుగు సార్లు గుడ్లు పెడతాయి. వీటి జీవితకాలం 20 నుంచి 23 ఏళ్లు.

ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు చూస్తుంటే భవిష్యత్తు తరాలకు పిచ్చుక బొమ్మ చూపించి ఇది పిచ్చుక అనే పక్షి, మన ఇండ్లలోనే తిరిగేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. మనిషితో కలిసి జీవించే పిచ్చుక జాతి అంతరించే ప్రమాదం మరెంతో దూరం లేకపోలేదు. అలాంటి పరిస్థితి రాకుండా పిచ్చుకలను బ్రతికించుకుందాం.

పిచ్చుకల పరిరక్షణ కోసం ప్రతి ఇంటి ఆవరణలో పక్షి గూళ్లను వేలాడదీయాలి. కొద్ది రోజులకు అవి మెల్లగా వాటిని నివాసంగా మార్చుకుంటాయి. చిన్న చిప్పల వంటి దానిలో మంచి నీరు పోసి ఇంటిపై ఉంచాలి. చిరుధాన్యాలు, జొన్నలు, నూకలు వంటివి అక్కడ వెదజల్లాలి. వాటి రాకకు స్వాగతం పలుకుదాం.

మనిషి తన స్వార్థం కోసం తోటి జీవులను పట్టించుకోకుండా ప్రవర్తిస్తే చివరకు దాని ప్రభావం మన మీద కూడా పడుతుందని గుర్తించాలి. పిచ్చుకల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

Tags

Related News

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Big Stories

×