E-Paper
Advertisement

Cholesterol : కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహార పదార్థం..

Cholesterol : కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహార పదార్థం..
Advertisement
Cholesterol

Cholesterol : చాలావరకు మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. కానీ ఈరోజుల్లో కాలుష్యం అనేది మనం తినే ఆహారాన్ని కూడా వదలడం లేదు. అందుకే తినే తిండి విషయంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈమధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తున్న కొలెస్ట్రాల్ సమస్యకు కూడా ఆహారంతోనే పరిష్కారం దొరకుంతుందని వైద్యులు చెప్తున్నారు. దీనికి చెక్ పెట్టడం కోసం ముఖ్యంగా ఒక ఆహార పదార్థం ఉపయోగపడుతుందని వారు గమనించారు.

కొలెస్ట్రాల్ అనేది మనిషి శరీరంలో కొవ్వు పెరిగిపోయినప్పుడు ఏర్పడే ఆరోగ్య సమస్య అని చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ కొలెస్ట్రాల్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి లో డెన్సిటీ లైపోప్రొటీన్ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్. దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఈ కొలెస్ట్రాల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే సోయాబీన్స్ అనేవి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని గమనించారు. దానికి కారణం అందులో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్స్ అని తెలుస్తోంది.

Advertisement

సోయాబీన్స్‌లో గ్లిసినిన్, బీటా కాంగ్లిసినిన్ అనే రెండు రకాల ప్రొటీన్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో ఉపయోగపడుతుందని వారు కనిపెట్టారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు.. 19 వెరైటీల సోయాబీన్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఒక్కొక్క సోయాబీన్‌లో ఒక్కొక్క శాతంలో గ్లిసినిన్, బీటా కాంగ్లిసినిన్ ప్రొటీన్లు ఉండడాన్ని వారు గమనించారు. ఆపై ఆ సోయాబీన్స్‌ను పిండిలాగా చేశారు. ఈ పిండిని టెస్ట్ చేసి చూసినప్పుడు దానిలో 13 బయోయాక్టివ్ పెప్టైడ్స్ ఉన్నాయని వారు తెలిపారు. అవన్నీ ముఖ్యంగా ఈ ప్రొటీన్స్ నుండి ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌కు ఉపయోగించే మందుల్లో కూడా సోయాబీన్స్ మెటీరియల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతే కాకుండా దానికోసం ఉపయోగించే మందుల్లోకంటే నేరుగా సోయాబీన్స్‌లో ఉండే ప్రొటీన్సే శక్తివంతమైనవని వారు గమనించారు. ఆపై వారు ఎంచుకున్న 19 వెరైటీల సోయాబీన్లలో 5 వెరైటీలపై తదుపరి పరీక్షలు చేపట్టారు. సోయాబీన్ అనేది డైజెస్టివ్ సిస్టమ్‌పై పాజిటివ్ ప్రభావం చూపిస్తుందని.. అదే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో ముఖ్య కారణమని వారు తేల్చారు. ఇది కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఉపసయోగపడే ప్రయోగం అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags

Related News

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

Big Stories

Advertisement
×