Big Stories

Somesh Kumar: సీట్లోకి సోమేశ్‌కుమార్.. ఇక సలహాలు షురూ..

somesh kumar

Somesh Kumar: సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలోని 6వ అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు సోమేశ్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -

సోమేశ్‌కుమార్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఏపీలో అనంతపురం కలెక్టర్‌ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక….జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రాజీవ్ శర్మ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నర్సింగరావు ఉన్నారు. అయినా సోమేశ్ కుమార్‌ను ప్రధాన సలహాదారుడిగా నియమించడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News