EPAPER

Sitting Problems : అలర్ట్.. ఎక్కువసేపు కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారా..?

Sitting Problems : వర్క్ ఫ్రం హోం.. ఆఫీస్ వర్క్ పేరుతో గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవలసి ఉంటుంది. ఎలా కూర్చున్నామో కూడా చూడకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కుర్చీపై కూర్చుంటాం.ఒకటి రెండు సార్లు కూర్చుంటే ఒకేకానీ.. అలానే కూర్చుని పనిచేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.

Sitting Problems : అలర్ట్.. ఎక్కువసేపు కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారా..?

Sitting Problems : వర్క్ ఫ్రం హోం.. ఆఫీస్ వర్క్ పేరుతో గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవలసి ఉంటుంది. ఎలా కూర్చున్నామో కూడా చూడకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కుర్చీపై కూర్చుంటాం. ఒకటి రెండు సార్లు కూర్చుంటే ఒకేకానీ.. అలానే కూర్చుని పనిచేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.


ఇలా కూర్చిల్లో గంటల తరబడి కూర్చుని పని చేసే వాళ్లు బాబోయ్ నడుము నొప్పి తట్టుకోలేక పోతున్నారా.. అంటూ అరిచే వాళ్లని చాలా మందిని చూసుంటాం. దీని ప్రభావం మెడ, వెన్నుపాముపై అధికంగా పడొచ్చు. మీరు ఎక్కువ సమయం కుర్చిలో కూర్చుని పని చేస్తే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావచ్చో తెలుసుకుందాం.

  • మీరు కూర్చున్న కుర్చీ కంఫర్ట్‌గా లేకుంటే అది వెన్నెముకపై ప్రభావం చూపిస్తుంది. నెమ్మదిగా మొదలైన ఈ నొప్పి మెడ నుంచి ఎముక వరకు వెళుతుంది.
  • ఒకే పొజీషన్‌లో ఎక్కువసేపు కదలకుండా కుర్చిలో కూర్చుంటే.. మీ శరీరం దిగువ భాగంలో కొవ్వు పెరుగుతుంది.
  • సరైన పొజీషన్‌లో కుర్చీపై కూర్చోకుంటే.. మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మీ దృష్టి పని మీద కాకుండా పక్కకు మళ్లుతుంది.
  • గంటల తరబడి ఒకే పొజీషన్‌లో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. కుర్చిపై కూర్చిని పని చేసే వ్యక్తుల్లో నడుము, పొట్ట, భుజం భాగాల్లో రక్తప్రసరణ సరీగా జరగపోవడం వలన తిమ్మిరి వంటి అసాధారణ సమస్యలు వస్తాయి.
  • ఎక్కువ సేపు కుర్చీలో కూర్చంటే గుండె జబ్బులు ముప్పు రెండితలు అధికమని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో కండరాలు కొవ్వును కరిగించలేవు.. దీంతో రక్తప్రసరణ మందగిస్తుంది. గుండెలోని రక్త నాళాల్లొ కొవ్వు పూడుకోవడం మొదలవుతుంది. ఇది గుండె జబ్బుకు, గుండె పోటుకు కారణం కావచ్చు.
  • కుర్చిలో కూర్చోడం వలన వీపు కండరాలు చాలా బిగుతుగా మిమ్మల్ని పట్టి ఉంచుతాయి. దీని వల్ల వెన్నెముక బాగా మందుకు వంగిపోతోంది. అలానే తుంటి ఎముక భాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
  • కూర్చోవడం వలన చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుతుంది. నడుము చుట్టూ అధిక స్థాయిలో కొవ్వు పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • కదలకుండా కుర్చిలో కూర్చునే వారికి నడుము దగ్గర పూసల మధ్య డిస్కులు బయటకు తోసుకుచ్చే ముప్పు ఏర్పడుతుంది. అటు ఇటు కదులుతున్నప్పుడు మెదడుకు రక్త సరఫరా పెరిగి.. మెదడును ఉత్సాహపరిచే, మానసిక స్థితిని మెరుగుపరచే రసాయనాలు విడుదలవుతాయి.


Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×