EPAPER

Shiva Vibhuti Dharana : విభూతి ధారణ చేయకుండా శివారాధన చేస్తే ఫలితం దక్కదా…?

Shiva Vibhuti Dharana : విభూతి ధారణ చేయకుండా శివారాధన చేస్తే ఫలితం దక్కదా…?

Shiva Vibhuti Dharana : శివునికి ఇష్టమైన విభూదిని శివభక్తులు ధరిస్తారు. ఈ భువిపై ఉన్న సమస్త తీర్థాలతో స్నానం చేస్తే కలిగే పుణ్యం భస్మధారణంతో కలుగుతుంది పురాణ వంచనం చెబుతోంది. విభూతి సాక్షాత్తూ శివస్వరూపమని విద్యారణ్యస్వామి సందేశం. విభూతినే భస్మమని, బూడిదని, భసితమని అంటారు. శివునికి ప్రీతికరమైన వస్తువుల్లో ఫ్రధానమైంది మొదటిది విభూతియని శాస్త్రవచనం.
పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతులు చిలికినప్పుడు ఒక్కోసారి ఒక్కో వస్తువు సముద్రంలోంచి వస్తూ ఉంటుంది. అలా ఒకసారి కామధేనువు, ఐరావతం ఇలా ఒక్కోటి వస్తూ ఉండగా, తమకి కావాల్సింది ఎవరికి వారు తీసుకుంటూ ఉంటారు. అలా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అనుకోకుండా గరళం వస్తుంది. ఆ విషాన్ని ఎవరో ఒకరు తీసుకోవాలి. లేదంటే క్షీర సాగర మధనం ముందుకు సాగదు.


విషాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు శివుడు తాను విషాన్ని తీసుకుంటానని వస్తాడు. అలా విషాన్ని గొంతులోకి పోసుకుంటాడు. అలా మొత్తం గరళాన్ని తన కంఠంలో దాచుకుంటాడు. ఐతే ఆ గరళం కారణంగా శివుడి శరీరం వేడెక్కిపోతుంది. వేడెక్కిన శరీరాన్ని చల్లార్చడానికి విభూది పెట్టుకుంటాడు. విభూది చల్లగా ఉంటుంది. శివుని విభూతి భక్తులకు అపార సిరిసంపదలను ప్రసాదిస్తూ సర్వపాపాలను హరిస్తూ, ఉపద్రవాలను నివారిస్తుంది.

విభూతి ధారణ చేయకుండా శివారాధన చేయకూడదని శాస్త్రం చెబుతోంది. విభూతి దారణలేని శివారాధన వ్యర్ధమని చెబుతోంది. భస్మధారణ చేయకుండా ఏ కర్మ చేయకూడదని, తెలిపింది. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి పక్కలకు గాని కనుబొమ్మల కిందకిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధిస్తాయి. తప్పక ధరించాలి. వామదేవుని నుంచి నీరు పుట్టింది. కృష్ణ వర్ణమైన భద్ర అనే గోవు పుట్టింది. గోవు గోమయం నుంచి భసితం కలిగింది. అఘోరుడ్ని నుంచి అగ్ని పుట్టింది.


Tags

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×