EPAPER

Scientists:- భూమిపై గ్రహంతరవాసుల ఆధారాలు.. నిజమేనా..?

Scientists:- భూమిపై గ్రహంతరవాసుల ఆధారాలు.. నిజమేనా..?

Scientists:- గ్రహంతరవాసులు ఉంటాయా లేదా? ఉంటే అవి మనుషులను గమనిస్తూ ఉంటాయా? అవి ఎప్పటికైనా భూమి మీదకు వచ్చే అవకాశం ఉందా? అన్న విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా.. అందుకే ఆ విషయంలో నిర్ధారణ కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే గ్రహంతరవాసులు ఇప్పటికే భూమిపైకి వచ్చారని, వారి శిలాజాలు ఇక్కడే ఉన్నాయని కొందరు అంటున్నారు. అది నిజమేనా..?


టెక్నాలజీ పెరగడం వల్ల దీనిపై పరిశోధనలు సులువుగా మారాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో పరిశోధనల విషయంలో కొత్త కొత్త మార్పులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే సోలార్ సిస్టమ్‌లో ఉన్న చాలావరకు గ్రహాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిగిపోయాయి. మరికొన్ని జరగనున్నాయి. అంతే కాకుండా సోలార్ సిస్టమ్ బయట కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి. భూమిలాంటి మరొక గ్రహం ఏదైనా మానవాళి జీవనానికి ఉపయోగపడేలా ఉందా అని తెలుసుకోవడంపై కూడా శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

స్పేస్ గురించి, గ్యాలక్సీల గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఒక ఇంట్రెస్టింగ్ అనుమానం వచ్చింది. ఒకవేళ గ్రహంతరవాసులు అనేవి ఉండుంటే.. వాటి ఫాజిల్స్ అనేవి భూమిపైనే ఎక్కడో ఉండి ఉంటాయి కదా అని.. దీనిపై శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా స్టడీ కూడా చేశారు. ఈ స్టడీ.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రానమీలో పబ్లిష్ కూడా అయ్యింది. మిల్కీ వేలో వారికి దొరికిన శాలిడ్ గ్రేయిన్స్ అనేవి జీవనాన్ని సూచిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇందులో పేర్కొన్నారు.


ఒకవేళ గ్రహంతరవాసులు అనేవారు ఉండుంటే ఇప్పటికే వేరే గ్యాలక్సీ నుండి వారి ఫాజిల్స్ అనేవి భూమిపైకి వచ్చి ఇక్కడ మట్టిలో పూర్తిగా కలిసిపోయి ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇంటర్‌స్టెల్లార్ డస్ట్ రూపంలో ఈ ఫాజిల్స్ భూగ్రహంలోకి వచ్చి ఉంటాయని వారి అనుమానం. ఏ ఆధారాలు లేకుండా శాస్త్రవేత్తలు ఇలాంటి నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదని కొందరు వాదిస్తున్నా.. పూర్తిగా దీనికి ఆధారాలు లేకుండా పోలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అనేది భూమిపైన పడిన ప్రతీసారి ఎక్కువ మొత్తంలో డస్ట్‌ను విడుదల చేస్తుంది. ఆ డస్ట్‌లో చాలావరకు భూమిపైనే ఉండిపోయినా.. కొంతవరకు స్పేస్‌ను చేరుకోగలుగుతుంది. అందులో 10 శాతం సోలార్ సిస్టమ్‌ను దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి వెళ్తుంది. ఇది ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌కు చేరుకోవడానికి కారణం.. అక్కడ మానవాళి లాగా మరొక జీవనం కొనసాగడమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే గ్రహంతరవాసుల ఉన్నాయన్న ఆలోచనను పూర్తిగా తీసిపారేయలేమని ఇప్పటికీ పలువురు శాస్త్రవేత్తలు ధృడంగా చెప్తున్నారు.

దేశాల మధ్య దూరం పెంచుతున్న గ్రీన్ టెక్నాలజీ..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×