EPAPER

Nandi Pooja : మీ కోరికలు నెరవేరాలంటే నందికి ఇలా చెప్పండి!

Nandi Pooja : మీ కోరికలు నెరవేరాలంటే నందికి ఇలా చెప్పండి!

Nandi Pooja : మీ కోరికలు నెరవేరాలంటే శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు.అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు.


నందివేద ధర్మ స్వరూపం. నంది మనలోని పశుతత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకుని వెనుక తోవైపు నిమురుతూ కొమ్ముల మధ్య నుంచి స్వామి నిచూస్తూ స్వామి నేను నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను. అందరికి మంచి చేస్తానని చెప్పిన తర్వాత దర్శనం చేసుకోవాలి. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.

లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి. ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ములనుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. శివుని ముందుకు నేరుగా వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.


Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×