EPAPER

Vasant Panchami:- వసంత పంచమి రోజు ఈ పూజ చేస్తే

Vasant Panchami:- వసంత పంచమి రోజు ఈ పూజ చేస్తే

Vasant Panchami:- వసంత పంచమి రుతు సంబంధమైన పండుగ. వసంతం అందరికి హద్ద్దులేని ఆనందాన్ని కలిగిస్తుంది. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఈ రుతువు నుంచే ప్రారంభం అవుతాయి. వసంతుడికి స్వాగతం పలుకుతూ ప్రకృత కొత్త కాంతులతో వెలుగుతూ ఉంటుంది.


వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు వస్తుంది. శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా సరస్వతి దేవీ మూలం . వసంత పంచమి రోజున జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది.

వసంత పంచమి రోజు సరస్వతి దేవిని శ్వేత పుష్పాలతో పూజించి, ధవళ వస్త్రాలని సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, నువ్వుండలు, చెరుకు ముక్కల్ని నివేదన చేయాలనీ స్వయం గా శ్రీమహావిష్ణువు నారదునికి వివరించినట్టు దేవి భాగవతం చెబుతోంది. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నురాలవుతుంది. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు. రతీదేవికి , కామదేవుడికి వసంతుడు ఈ ముగ్గురు ఒక్క రోజు పూజలందుకుంటారు.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×