EPAPER

Sankranti celebrations in Srisailam: శ్రీశైలంలో సంక్రాంతి సంబరాలు

Sankranti celebrations in Srisailam: శ్రీశైలంలో సంక్రాంతి సంబరాలు
Sankranti celebrations in Srisailam

మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయి. ఏటా రెండు సార్లు మల్లికార్జున స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.


సంప్రదాయం ప్రకారం సంక్రాంతికి, శివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు నుంచి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు ఉంటాయి.


ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. అదే రోజు చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, శ్రీ స్వామి అమ్మ వార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ‌

Follow this link for updates:- Bigtv

Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×