EPAPER

Rolls-Royce’s : చంద్రుడిపై రోల్స్ రాయిస్ ప్రయోగం.. అండగా యూకే..

Rolls-Royce’s : చంద్రుడిపై రోల్స్ రాయిస్ ప్రయోగం.. అండగా యూకే..

Rolls-Royce’s :స్పేస్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడానికి కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు.. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని ఎన్నో స్పేస్ ఏజెన్సీలకు ప్రైవేట్ రంగ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఓ ఆటోమొబైల్ కంపెనీ కూడా యూకే స్పేస్ ఏజెన్సీతో చేతులు కలిపి కార్ల తయారీలో కొత్త అధ్యాయనం మొదలుపెట్టాలి అనుకుంటోంది. ఆ కంపెనీ ఏదో కాదు.. రోల్స్ రాయిస్.


రోల్స్ రాయిస్ అనేది మామూలు పేరు కాదు. ఒక బ్రాండ్. కేవలం సూపర్ రిచ్ వ్యక్తులు మాత్రమే ఉపయోగించగలిగే ఒక బ్రాండ్. న్యూక్లియర్ పవర్ అనేది చంద్రుడిపై ప్రయోగాలు చేయడానికి ఆస్ట్రానాట్స్‌కు ఎలా ఉపయోగపడుతుంది అని తెలిసేలా చేయడానికి రోల్స్ రాయిస్ ప్రయోగాలు చేయనుంది. మైక్రో రియాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా రోల్స్ రాయిస్ ఈ ప్రయోగాలను మొదలుపెట్టనుంది. అయితే దీనిని ముందుకు తీసుకెళ్లడానికి రోల్స్ రాయిస్‌కు యూకే స్పేస్ ఏజెన్సీ (అక్సా) నుండి పెట్టుబడి కూడా లభించింది.

న్యూక్లియర్ పవర్ అనేది కచ్చితంగా ల్యూనార్ మిషిన్స్‌లో ఉపయోగకరంగా ఉంటుందని యూకే పరిశోధకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే రోల్స్ రాయిస్‌తో ఈ డీల్‌కు ఒప్పుకున్నారు. ల్యూనార్ మిషిన్స్ సమయం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ల్యూనార్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ కోసం 2,49,000 యూరోల పెట్టుబడిని అక్సా అందించింది. తాజాగా మరో 2.9 మిలియన్ల యూరోలను ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడిగా పెట్టింది.


2029లోపు ఈ రియాక్టర్‌ను తయారు చేయాలని రోల్స్ రాయిస్ టార్గెట్‌గా పెట్టుకుంది. న్యూక్లియర్ మైక్రో రియాక్టర్ అనేది మిగతా పవర్ సిస్టమ్స్‌తో పోలిస్తే.. చిన్నగా, తక్కువ బరువుతో ఉంటుందని తెలుస్తోంది. చుట్టూ ఉన్న వాతావరణం, సన్‌లైట్, లొకేషన్ లాంటి అంశాలతో సంబంధం లేకుండా ఈ రియాక్టర్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై జరిగే ప్రతీ పరిశోధన కోసం అంతరిక్షంలో జరిగే మార్పులను గమనించడం ముఖ్యమని, దానికోసమే ఇలాంటి రియాక్టర్స్ ఉపయోగపడతాయని వారు అన్నారు.

గత 50 ఏళ్ల కాలంలో ప్రస్తుతం ల్యూనార్ మిషిన్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. చంద్రుడిపై అడుగుపెట్టాలి అనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అందుకే రోల్స్ రాయిస్‌తో చేసుకున్న ఈ ల్యూనార్ మాడ్యులర్ రియాక్టర్ ఒప్పందం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అక్సా భావిస్తోంది. అంతే కాకుండా ఇలాంటి ఒప్పందాల వల్ల స్పేస్ టెక్ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అక్సాతో పాటు మరెన్నో ఇతర ఏజెన్సీలతో రోల్స్ రాయిస్ ఒప్పందాలు చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×