E-Paper
Advertisement

Robotic Surgery : మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన రోబో..

Robotic Surgery : మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన రోబో..
Advertisement
Robotic Surgery

Robotic Surgery : టెక్నాలజీ వల్ల ఎన్నో రంగాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. అలాగే వైద్యరంగంలో కూడా వచ్చాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఏ ప్రాణాంతక వ్యాధికి అయినా టెక్నాలజీతో చికిత్స చేసే అవకాశం లభిస్తోంది. అంతే కాకుండా కొన్ని ఆపరేషన్స్ అయితే.. డాక్టర్ల ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. తాజాగా ఓ ఆపరేషన్‌లో వైద్యులకు ఏకంగా రోబోలే సహాయంగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. రోబో సాయాన్ని వైద్యులు ప్రశంసిస్తున్నారు.

టెక్నాలజీ పెరగడంతో పేషెంట్లకు చికిత్స త్వరగా అందడం మాత్రమే కాకుండా వారు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో రోబోలు వారికి సాయంగా ఉంటాయని వారు చెప్తున్నారు. ఇప్పటికే రోబోలు అన్ని రంగాల్లో మనుషులకు సాయంగా నిలబడుతున్నాయి. వైద్య వృత్తిలో కూడా ఇవి ఎప్పుడో ఎంటర్ అయ్యాయి. ఇప్పటికే రోబోల సాయంతో పలు సక్సెస్‌ఫుల్ సర్జరీలు కూడా జరిగాయి. అందుకే త్వరలోనే రోబోలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

యూకేలోని వాల్సల్ మానోర్ హాస్పిటల్‌లో తాజాగా ఒక రోబో ఆర్థోపెడిక్ సర్జరీలో పాల్గొంది. అచ్చం డాక్టర్‌లాగానే మాస్క్ పెట్టుకొని ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఒక జెనరల్ హాస్పటల్‌లో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారని అక్కడి వైద్యులు చెప్తున్నారు. వారు కూడా రోబోను పూర్తిగా నమ్మి ఆపరేషన్‌లో భాగం చేసుకున్నారు. ఇక 60 ఏళ్ల వద్ధుడికి మోకాలు మార్పిడి సర్జరీలో రోబో సాయంగా నిలబడి సక్సెస్ సాధించింది. ఇలాంటి రోబోల సాయం మరికొన్ని ఆపరేషన్లలో దక్కుతుందని వైద్యులు ఆశిస్తున్నారు.

వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధపడే ప్రక్రియలో, రోబోలు సిద్ధపడే ప్రక్రియలో కొన్ని మార్పులు ఉంటాయి. ముందుగా రోబో టెక్నాలజీతో మోకాలుకు సంబంధించిన 3డి ఇమేజ్ రెడీ అవుతుంది. మోకాలులో ఏ భాగానికి సర్జరీ జరగాలో ఇందులో స్పష్టంగా ఉంటుంది. ముందుగా ఆ భాగాన్ని తీసేసి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ మోకాలి భాగాన్ని జతచేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ టెబుల్ పక్కనే ఒక పెద్ద టేబుల్‌పై రోబోటిక్ ఆర్మ్ ఏర్పాటు చేయబడుతుంది. దానికి ఆపరేట్ చేయాల్సిన బోన్ సా అటాచ్ చేయబడుతుంది. పక్కనే ఉన్న డాక్టర్లు ఆపరేషన్ మొదలయిన తర్వాత రోబోను స్టార్ట్, స్టాప్ చేసే సౌలభ్యం ఉంటుంది. ఈ ప్రక్రియను ఫాలో అయ్యి ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది రోబోటిక్ ఆర్మ్.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×