EPAPER
Kirrak Couples Episode 1

Plant Doctors:అలా పిలవడం కరెక్ట్ కాదు..! తైవాన్ వైద్యుల వాదన..

Plant Doctors:అలా పిలవడం కరెక్ట్ కాదు..! తైవాన్ వైద్యుల వాదన..

Plant Doctors:వ్యవసాయాన్ని మాత్రమే కాదు.. మొక్కల పెంపకాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎంతోమంది పర్యావరణవేత్తలు కష్టపడుతున్నారు. అదే లక్ష్యంతో శాస్త్రవేత్తలు కూడా మొక్కల పెంపకం ఎలా చేస్తే బాగుంటుంది అని అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా తైవాన్‌లోని శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేసి మొక్కల పెంపకాన్ని చట్టపరం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.


కొన్నాళ్లుగా తైవాన్‌లో నాలుగు యూనివర్సిటీలు కలిసి మొక్కల మెడిసిన్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాయి. అయితే దీనికి చట్టపరంగా ప్లాంట్ డాక్టర్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టాలని, ప్లాంట్ డాక్టర్ అనే పదాన్ని చట్టబద్ధం చేయాలని వారు శాసనసభలో పిటీషన్ వేశారు. గతేడాది నుండి ఈ పిటీషన్.. యువాన్ ఎకానమిక్స్ కమిటీ ముందు ఉంది. అయితే పలువురు వైద్యులు.. ‘ప్లాంట్ డాక్టర్’ అనే పదమే తప్పు అని ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.

ఈ విషయంపై పోరాడుతున్న నేషనల్ తైవాన్ యూనివర్సిటీ (ఎన్టీయూ), నేషనల్ చుంగ్ హ్సింగ్ యూనివర్సిటీ, నేషనల్ చియాయి యూనివర్సిటీ, నేషనల్ పింగ్‌టుంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. వీరంతా కలిసి ఈ పిటీషన్ పాస్ అవ్వడం కోసం 4000 సంతకాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది హౌస్‌వైఫ్స్, రైతులు కూడా ఈ పిటీషన్‌లో సంతకాలు చేసినట్టు యూనివర్సిటీల పెద్దలు చెప్తున్నారు.


అసలు ప్లాంట్ డాక్టర్ అన్న పదమే అసంబద్ధమైనదని ఎంతోమంది ఫిజిషియన్స్, డెంటిస్టులు, డాక్టర్లు వాదనలు చేస్తున్నారు. డాక్టర్ అనే పదం పలు బాధ్యతలతో కూడుకుంటుందని, మనుషుల ఆరోగ్యం కోసం కృషిచేసే వారిని మాత్రమే డాక్టర్ అనాలని వారు అంటున్నారు. మొక్కల సంరక్షణ కోసం పనిచేసే వారిని తాము కూడా గౌరవిస్తామని, కానీ వారిని డాక్టర్ అని పిలవడం మాత్రం కరెక్ట్ కాదని వారు భావిస్తున్నారు. ప్లాంట్ డాక్టర్ అనే పదాన్ని వారు సమ్మతిస్తే.. భవిష్యత్తులో కంప్యూటర్ డాక్టర్స్, రోడ్ డాక్టర్స్ అనే పేర్లు కూడా అధికారంలోకి వస్తాయని వారు అంటున్నారు.

ప్లాంట్ డాక్టర్స్ అనే పదం అయితే అందరికీ అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని పర్యావరణవేత్తల వాదన. ఇప్పటికే యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ పదాన్ని తరచుగా ఉపయోగిస్తుందని వారు గుర్తుచేశారు. డాక్టర్లు అనే పదం ఆరోగ్యాన్ని కాపాడి, వ్యాధులను నివారించే వారికి వర్తిస్తుందని.. అది మనుషులకు అయినా మొక్కలకు అయినా ఒకటే అని పర్యావరణవేత్తలు అంటున్నారు.

Tags

Related News

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Big Stories

×