EPAPER

US Airfares : దడ పుట్టిస్తున్న ఎయిర్ బస్సు ఛార్జీలు

US Airfares : దడ పుట్టిస్తున్న ఎయిర్ బస్సు ఛార్జీలు

US Airfares : చదువు కోసం, పర్యటన కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్లు… విమాన ఛార్జీలు చూసి హడలిపోతున్నారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో… ఛార్జీల్ని ఏకంగా 50 శాతానికి మించి పెంచేశాయి… విమానయాన సంస్థలు. ఓవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం, మరోవైపు ఛార్జీలు భారీగా పెరగడంతో… అమెరికాకు వెళ్లేందుకు సిద్ధం చేసుకున్న బడ్జెట్ తలకిందులై… అంతా గగ్గోలు పెడుతున్నారు.


అమెరికాలో వచ్చే జనవరి నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలై… మూడో వారం నుంచి లేదా ఫిబ్రవరిలో క్లాసులు ప్రారంభమవుతాయి. దాంతో… డిసెంబర్ నుంచే అమెరికా వెళ్లేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతుంటారు. విద్యార్థులకు జారీ చేసే F1 వీసా… 120 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. వీసా ఉన్నా 30 రోజులు ముందుగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. చదువు కోసం వచ్చే విద్యార్థులకు… రెండు దఫాలుగా F1 వీసా స్లాట్లను జారీ చేస్తామని ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడత విద్యార్థి వీసా స్లాట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. F1 వీసా జారీ ప్రక్రియ ప్రారంభం కాగానే… టికెట్ల బుకింగ్‌కు డిమాండు పెరుగుతుంది. బుకింగ్‌ ఆలస్యమయ్యే కొద్దీ టికెట్ల ధరలు పెరగుతూ పోతాయి.

ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థులు ఎక్కువగా వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలిస్‌, షికాగో, కాలిఫోర్నియా, డాలస్‌, హ్యూస్టన్‌, ఇండియానా పొలిస్‌ తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. ప్రస్తుతం టికెట్లకు ఈ మార్గంలోనే ఎక్కువ డిమాండ్ ఉంది. అమెరికాలో సెలవుల సీజన్ కూడా డిసెంబరు నుంచే మొదలవుతుండటంతో… అక్కడి నుంచి వచ్చేవారి సంఖ్యా పెరిగి… ఆ టికెట్ల ధరలూ భారీగా పెరిగాయి. సాధారణ సమయాల్లో ఒక వ్యక్తి సింగిల్‌ స్టాప్‌తో అమెరికా వెళ్లి రావటానికి లక్షన్నర నుంచి లక్షా 75 వేలు ఖర్చవుతుంది. అదే ఇప్పుడు ఒక వైపు ప్రయాణానికే లక్షా 75 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ మీదుగా డాలస్‌ వెళ్లేందుకు విమాన టికెట్‌ ధర రూ.98 వేలకు పైగా ఉంది. వచ్చే జనవరి మూడోవారంలో అదే టికెట్‌ ధర లక్షా 38 వేలుగా ఉంది. దోహా మీదుగా డాలస్‌కు వెళ్లాలంటే టికెట్‌ ధర రూ.1.29 లక్షల నుంచి రూ.1.38 లక్షల రేంజ్ లో ఉంది. విమానయాన సంస్థల్ని బట్టి కూడా టికెట్ల ధరలు మారుతున్నాయి. అయితే… ధర ఎక్కువగా ఉన్నా ప్రస్తుతానికి టికెట్లు మాత్రం కావాల్సినన్ని ఉన్నాయని చెబుతున్నారు.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×