EPAPER

Telangana Police Recruitment : అక్టోబర్ 27 నుంచి పార్ట్ 2 అప్లికేషన్ స్టార్ట్ (తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్)

Telangana Police Recruitment : అక్టోబర్ 27 నుంచి పార్ట్ 2 అప్లికేషన్ స్టార్ట్ (తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్)

Telangana Police Recruitment : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. దీంతో పార్ట్ 2 కోసం అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ప్రిలిమ్స్‌లో పాస్ అయిన అభ్యర్ధులు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు పార్ట్‌2 కు దరఖాస్తు చేసుకోవాలి.


పార్ట్ 2 అప్లై చేసే సమయంలో అవసరమైన సర్టిఫికేట్లను టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. అపలోడ్ చేయని అభ్యర్ధుల అప్లికేషన్‌ను టీఎస్‌ఎల్‌పీఆర్బీ పరిగణనలోకి తీసుకోదు. ప్రిలిమ్స్‌లో మొత్తం 2.69 లక్షల మంది పాస్ అయ్యారు. ఇచ్చిన 15 రోజుల గడువులో రోజుకు 18 వేల మంది పార్ట్ 2 కోసం అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి చివరి రోజు వరకు వేచి చూస్తే.. సర్వర్ డౌన్ అయి మీ అప్లికేషన్, సర్టిఫికేట్ అప్లోడ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్ 2 అప్లికేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చూడండి.

పార్ట్ 2 అప్లికేషన్‌లో అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు


1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్
ఎస్ఎస్‌సీ మెమో
కానిస్టేబుల్‌కు ఇంటర్ మెమో, ఎస్సై పోస్టుకు డిగ్రీ మెమో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, వయోపరిమితి సడలింపునకు అవసరమైన క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు
బీసీ అభ్యర్ధులు 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ అయిన నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్
ఎస్టీ అభ్యర్ధులు ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణపత్రం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోటా కోసం సర్వీస్ సర్టిఫికెట్
మాజీ సైనికోద్యోగులు వయోపరిమితి సర్వీస్‌మెన్ కోటా కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదంటే డిశ్ఛార్జ్ బుక్

Tags

Related News

SSC GD Recruitment 2024: టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే !

ITBP Recruitment 2024: టెన్త్ అర్హతతో 819 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

THSTI Recruitment 2024: టీహెచ్ఎస్టీఐలో మేనేజర్ పోస్టులు..అర్హతలివే !

UBI Recruitment 2024: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే !

CISF Recruitment 2024: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ITBP Recruitment 2024: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హతలివే !

Big Stories

×