EPAPER

OpenAI : యాప్ రూపంలో ఓపెన్ ఏఐ సేవలు..

OpenAI : యాప్ రూపంలో ఓపెన్ ఏఐ సేవలు..

OpenAI: మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఓపెన్ఏఐ.. టెక్నాలజీ ప్రపంచంలోనే రాజ్యాన్ని ఏలుతోంది. ఓపెన్ఏఐ అనేది కేవలం ఈ రంగంలోనే తన సత్తా చాటుతుంది అనుకోవడానికి లేకుండా ఏ రంగంలో చూసినా.. దీని క్రేజ్ వేరే లెవల్‌లో ఉంది. అందుకే యూజర్లకు ఓపెన్‌ఏఐను, దానికి సంబంధించన మోడల్స్‌ను దగ్గర చేయడానికి మరో కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. త్వరలోనే ఆన్‌లైన్‌ను తమ మార్కెట్ ప్లేస్‌గా మార్చుకోవాలని అనుకుంటోంది.


ఏఐ అనేది భవిష్యత్తులో చాలా ఉపయోగపడే టెక్నాలజీ అని తెలుసుకున్న కొందరు టెక్ ఉద్యోగులు.. ఇప్పటికీ దీని విషయంలో ప్రత్యేకమైన ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. మరికొందరు అయితే తమ సామర్థ్యంతో కొత్త ఏఐ మోడల్స్‌ను తయారు చేస్తున్నారు. కానీ వారు ఓపెన్‌గా తమ మోడల్‌ను అమ్ముకోవడానికి ఒక మార్కెట్ అంటూ లేదు. అలాంటి మార్కెట్ ప్లేస్‌ను వారికి అందించాలని ఓపెన్ఏఐ నిర్ణయించుకుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఏఐ మోడల్‌ను కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా.. ఈ యాప్‌ను ఒక మార్కెట్ ప్లేస్‌గా మార్చాలని సామ్ ఆల్ట్‌మ్యాన్ కంపెనీ అనుకుంటోంది. ఓపెన్ఏఐ సీఈఓ అయిన ఆల్ట్‌మ్యాన్ ఇప్పటికే తమ సంస్థ డెవలపర్స్‌కు ఇలాంటి ఒక యాప్‌ను తయారు చేయమని ఆదేశించారట. కానీ ఈ యాప్ తయారీ విషయంలో కానీ, ఆన్‌లైన్ మార్కెట్‌ను బలపరుచుకునే విషయంలో కానీ ఓపెన్ఏఐ తగినంత ఆసక్తిని చూపించడం లేదని నిపుణులు భావిస్తున్నారు.


తాజాగా ఓపెన్ఏఐ దాదాపు 175 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను అందుకుంది. ఈ ఫండ్‌తో ఏఐ కోసం కష్టపడుతున్న స్టార్టప్స్‌కు సాయంగా ఉండడంతో పాటు మైక్రోసాఫ్ట్‌కు ఆర్థికంగా పెట్టుబడిగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఓపెన్ఏఐ స్టార్టప్ ఫండ్ 1 అనేది ఊహించిన దానికంటే ఎక్కువగానే వారికి అందింది. ముందుగా ఓపెన్ఏఐ వేసుకున్న ప్లాన్‌ కంటే ఇది 75 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. దాదాపు 14 మంది ఇన్వెస్టర్ల దగ్గర నుండి ఓపెన్ఏఐ ఈ ఫండ్‌ను అందుకుంది.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×