EPAPER

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు
  •  రిటైర్డ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులకు పిలుపు
  • కొందర్ని మళ్లీ ప్రశ్నించనున్న కమిషన్
  •  29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్
  • ఘోష్‌తో విజిలెన్స్ చీఫ్ భేటీ
  • విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్‌పై దృష్టి
  • మేడిగడ్డ ఘటనకు ఏడాది పూర్తి

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ మరోసారి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఇంకోసారి ఉన్నతాధికారులు, రిటైర్డు ఇంజినీర్లను విచారించనుంది. ఎవరెవరిని పిలవాలి అనే అంశంపై ఇప్పటికే కమిషన్ అధికారులతో చంద్రఘోష్ భేటీ అయ్యారు. ఇప్పటికే సీడీవో, కాళేశ్వరం కార్పొరేషన్, ఇరిగేషన్ తాజా మాజీ అధికారులను విచారించారు. వీరిలో కొందరిని మళ్లీ విచారించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు బ్యూరోక్రాట్లు, ఇంజినీర్ల విచారణ పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 29న ఓవరాల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని అంటున్నారు.


ఘోష్‌ను కలిసిన విజిలెన్స్ చీఫ్

బీఆర్కే భవన్‌లో కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌తో భేటీ అయ్యారు విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్‌పై కమిషన్ దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫైనల్ నివేదిక ఆలస్యంపై అరా తీశారు ఘోష్. భేటీ అనంతరం కొత్తకోట మాట్లాడుతూ, కాళేశ్వరం కమిషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. మళ్ళీ ఓపెన్ కోర్టు మొదలవుతోందని, రెండు సెషన్స్‌లో ఇది ఉంటుందన్నారు. ఈ నెలాఖరు వరకు ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ కమిషన్‌కు ఇవ్వనున్నారు.


మేడిగడ్డ ఘటనకు ఏడాది పూర్తి

గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం బయటపడి ఏడాది పూర్తి అయ్యింది. అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఒక వండర్‌గా నిలిచే ఈ ప్రాజెక్టును తన మెదడు కరిగించి నిర్మాణం చేశానని గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు నీటిమీద రాతలని రుజువై సంవత్సరం గడిచింది. మేడిగడ్డ కూలిన ఘటనకు ఏడాది పూర్తయింది. 2023 అక్టోబర్ 21న కేసీఆర్ ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాయ, తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది. ప్రపంచ అద్భుత కట్టడం అంటూ లక్ష కోట్ల దాకా అప్పు చేసి నిర్మించిన ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ కుంగిపోయింది. ఏడవ బ్లాకులో ఉన్న వంతెన నాలుగున్నర ఫీట్ల మేర కుంగిపోయి కనిపించింది. ఏం జరిగిందో తెలియని ఇంజినీర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేశామని అప్పటిదాకా సినిమా చూపించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, ప్రాజెక్టుకు ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. తమ నిర్లక్ష్యం బయటపడద్దని మావోయిస్టుల దుశ్చర్య జరిగి ఉండొచ్చు అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం బయటపెట్టిన రేవంత్ సర్కార్

ప్రజా పాలన పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిషేధాజ్ఞలను ఎత్తివేసింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ ప్రజల ముందు ఉంచింది. మంత్రుల బృందం పర్యటనతో ప్రజాప్రతినిధులకు, గత సర్కారు నిర్వాకాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. అంతేకాదు, తెలంగాణలోని ప్రతి ఎకరాకు కాలేశ్వరం నీళ్లు అందించామని మైకుల ముందు ఊదరగొట్టిన బీఆర్ఎస్ పెద్దల బాగోతాన్ని రేవంత్ సర్కార్ లెక్కలతో సహా బయటపెట్టింది. లక్ష కోట్లు ఖర్చు చేసినా, 93 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించిందనే కఠోర నిజాన్ని బయటపెట్టింది. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టుపై తెచ్చిన అప్పుకు సుమారు 12 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకే చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు డీపీఆర్‌లు, నిర్మాణ స్థల ఎంపిక, నిర్మాణం సంస్థల ఒప్పందాలు, నాణ్యత పరీక్షల రిపోర్టులు ఇలా అన్నిట్లోనూ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం నిట్టనిలువునా బయటపెట్టింది. బ్యారేజీలకు జరిగిన డ్యామేజ్ సరిదిద్దలేని స్థాయిలో ఉందని

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×