EPAPER

NOKIA: రూపురేఖలు మార్చిన నోకియా.. కొత్త వ్యూహంతో..

NOKIA: రూపురేఖలు మార్చిన నోకియా.. కొత్త వ్యూహంతో..
NOKIA

ల్యాండ్ లైన్ నుండి మొబైల్ ఫోన్‌కు షిఫ్ట్ అవుతున్న కాలం అది..! కొత్త ఫోన్‌ను కొనాలనుకున్నవారు షాప్‌లోకి వెళ్లి మోడల్ పేరు చెప్పాల్సిన పని లేదు. షాప్‌లోకి వెళ్లి మొబైల్ ఫోన్ గురించి అడిగిన వెంటనే ఒక ఫోన్‌ను ముందు పెట్టేవారు. అదే నోకియా. ఆ తర్వాత చాలాకాలం పాటు నోకియాకు పోటీగా ఏ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి రాలేదు. అలాంటి నోకియా ఇప్పుడు తన రూపురేఖలను మార్చేసుకుంది. కొత్త రూపంలో అందరికీ అందుబాటులోకి రానుంది.


ముందుతరం వారిలో చాలామంది మొదటిగా ఉపయోగించిన మొబైల్ ఫోన్ నోకియా(NOKIA). అప్పట్లో ఈ ఫోన్ క్రేజ్‌కు హద్దులు లేవు. ఇందులో వచ్చే గేమ్స్ దగ్గర నుండి రింగ్‌టోన్స్ వరకు.. అన్ని ఫీచర్స్ ఇప్పటికీ చాలామందికి గుర్తున్నాయంటే నోకియా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కానీ మెల్లగా మార్కెట్లో మొబైల్ ఫోన్లకు పోటీ పెరిగిపోయింది. సరికొత్త డిజైన్లతో, కొత్త కొత్త మోడల్స్‌తో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆపై స్మార్ట్ ఫోన్స్ కూడా మార్కెట్లో హల్‌చల్ చేశాయి.

స్మార్ట్ ఫోన్స్‌కు వస్తున్న క్రేజ్‌ను గమనించిన నోకియా.. తాను కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిందిజ. కానీ ఇతర కంపెనీల పోటీకి తట్టుకోలేక ఎక్కువకాలం నిలబడలేకపోయింది. కొన్నాళ్లు నోకియా పేరు టెక్ ప్రపంచంలో వినిపించలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నోకియా.. అప్డేటెడ్ వర్షన్‌తో అందరికీ షాకిస్తోంది. 60 ఏళ్ల కాలంలో నోకియా తన లోగోను మార్చడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా ఈరోజుల్లో మార్కెట్లో పోటీపడేలాగా కొత్త కొత్త వ్యూహాలతో నోకియా సిద్ధమయినట్టుగా తెలుస్తోంది.


నోకియా కొత్త లోగో చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇందులో కేవలం బ్లూ కలర్ మాత్రమే ఉండేది. కానీ అప్పటిలాగా ఇప్పుడు నోకియా కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదు.. ఒక బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా. యూజర్లకు మళ్లీ దగ్గరవ్వడానికి రీసెట్, యాక్సిలరేట్, స్కేల్ అనే వ్యూహంతో నోకియా సిద్ధమయ్యింది. తన టెలికాం బిజినెస్‌ను మెరుగుపరచడంతో పాటు పరికాలను ఇతర సంస్థలకు అమ్మే బిజినెస్‌లో కూడా నోకియా అడుగుపెట్టింది. 5జీ సర్వీసుల విషయంలో కూడా పెద్ద సంస్థలతో పోటీపడడానికి నోకియా సిద్ధమయినట్టుగా తెలుస్తోంది.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×