EPAPER

Smart Bandage : కొత్తగా స్మార్ట్ బ్యాండేజ్.. ప్రత్యేకంగా వారికోసమే..

Smart Bandage : కొత్తగా స్మార్ట్ బ్యాండేజ్.. ప్రత్యేకంగా వారికోసమే..
Smart Bandage

Smart Bandage : ఒకప్పుడు ఆపరేషన్స్ అనేవి నొప్పితో కూడుకునేవి. ఆపరేషన్స్ మాత్రమే కాదు.. వైద్య రంగంలో పేషెంట్లకు చేసే చాలావరకు చికిత్సలు వారిని ఎంతో నొప్పికి గురిచేసేవి. కానీ రోజులు మారిపోయాయి. నొప్పి తెలియకుండానే చికిత్స అయిపోతుంది. తాజాగా సూది లేకుండానే ఇంజెక్షన్ల తయారీ కూడా మొదలయ్యింది. అలాగే బ్యాండేజీల విషయంలో కూడా కొత్త అధ్యాయనం మొదలుకానుంది. అదే స్మార్ట్ బ్యాండేజెస్.


చిన్న దెబ్బ తగిలితే.. డాక్టర్ వరకు వెళ్లడం ఎందుకని చాలామంది బ్యాండేజ్‌లను తెచ్చుకొని వేసుకుంటారు. కొన్నిరోజులకు బ్యాండేజ్ కారణంగా ఈ దెబ్బ తగ్గిపోతుంది. కానీ కొందరికి మాత్రం ఈ బ్యాండేజీలు మంచిది కాదని వైద్యులు అంటున్నారు. డయాబెటీస్‌తో బాధపడేవారి దెబ్బను బ్యాండేజీలు నయం చేయలేవని ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాంటి వారికోసమే స్మార్ట్ బ్యాండేజీలు అనేవి అందుబాటులోకి రానున్నాయి.

క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ బ్యాండేజీని తయారు చేశారు. ఇవి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్లను దృష్టిలో పెట్టుకునే తయారు చేసినట్టు తెలుస్తోంది. షుగర్ పేషెంట్లకు ఏదైనా గాయం అయినప్పుడు అది మానిపోకుండా డయాబెటీస్ అడ్డుపడుతుంది. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే వారికి బ్యాండేజీతో గాయం నయం అయిపోవడం లాంటిది జరగదు.


డయాబెటీస్ పేషెంట్లకు కూడా గాయం నయం అయిపోవడానికి స్మార్ట్ బ్యాండేజ్ తయారీ జరిగింది. ఇవి గాయాలను తొందరగా నయం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో అయిపోయేలా చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్లకు తగిలే గాయాలను నయం చేయడానికి ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం ఎంతో తీసుకున్నామని, అందులో భాగంగానే ఈ స్మార్ట్ బ్యాండేజ్ తయారీ జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

స్మార్ట్ బ్యాండేజీలు అనేవి మామూలు బ్యాండేజీల లాగా ఉండవు. వీటిలో ఎలక్ట్రానిక్స్, మెడికేషన్ లాంటివి పొందుపరిచి ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఒక సెన్సార్ కూడా ఉంటుంది. ఇది ఆ గాయానికి సంబంధించిన సమాచారాన్ని పేషెంట్‌కు అందజేస్తూ ఉంటుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్స్ ప్రమాదం గురించి వారికి ముందే తెలిసిపోతుంది. గాయానికి సంబంధించిన సమాచారాన్ని పేషెంట్ కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్.. ఇలా పరికరాలకు పంపిస్తూ ఉంటుంది స్మార్ట్ బ్యాండేజ్. ఈ స్మార్ట్ బ్యాండేజ్ ఫీచర్స్ గురించి విన్నవారు ఇది సూపర్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×