EPAPER

Bank Locker:లాకర్లలో ఇకపై వాటికి చోటు లేదు..

Bank Locker:లాకర్లలో ఇకపై వాటికి చోటు లేదు..

Bank Locker:బ్యాంకుల్లో లాకర్లు ఉన్న వినియోగదారులకు షాక్ లాంటి న్యూస్. ఇకపై లాకర్లలో నోట్ల కట్టలు ఇష్టం వచ్చినట్లు కుక్కేయడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే… ఒక్క కరెన్సీ నోటు పెట్టడానికి కూడా బ్యాంకులు అనుమతించవు. లాకర్లు ఉన్న వినియోగదారులు బ్యాంకుతో కొత్త ఒప్పందం చేసుకోవాలని… రూ.200 స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది.


లాకర్ల వినియోగదారులు బ్యాంకులతో కొత్త ఒప్పందం కుదుర్చుకునే గడువు గత జనవరి 1 నాడే ముగిసింది. అగ్రిమెంట్ చేసుకోని అకౌంట్ హోల్డర్ల లాకర్లను కొన్ని బ్యాంకులు ఇప్పటికే సీజ్ చేశాయి కూడా. అయితే, చాలా మంది ఇంకా కొత్త అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో గడువును ఈ ఏడాది చివరి దాకా పొడిగించిన ఆర్బీఐ… సీజ్‌ చేసిన లాకర్లను వినియోగదారులు వాడుకునే వీలు కల్పించాలని బ్యాంకుల్ని ఆదేశించింది.

ఇక లాకర్లకు కొత్త అగ్రిమెంట్ విషయంలో బ్యాంకులకు కొత్త లక్ష్యాలు విధించింది… ఆర్బీఐ. వచ్చే జూన్‌ 30 నాటికి 50 శాతం మంది, సెప్టెంబరు 30 నాటికి 75 శాతం మంది, డిసెంబరు 31 నాటికి 100 శాతం మంది వినియోగదారుల కొత్త అగ్రిమెంట్లు పూర్తి చేయాలని ఆదేశించింది. గడువుపై ఖాతాదారులందరికీ వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. కొత్త ఒప్పందం ప్రకారం లాకర్లలో నగదు దాచడానికి వీల్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లాకర్‌ ఇచ్చే ముందే వినియోగదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఇప్పటికే లాకర్లు ఉన్న ఖాతాదారుడి నుంచి… అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ లాంటి వివరాలేవీ మారలేదని డిజిటల్ విధానంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. ఒకవేళ అడ్రస్, ఇతర వివరాలు మారితే… ఆధార్‌, ఓటరు ఐడీ లాంటి గుర్తింపు పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుని… కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలని సూచించింది.


నోట్ల రద్దు సమయంలో చాలా మంది ఖాతాదారులు బ్యాంక్ మేనేజర్ల సాయంతో లాకర్ల నుంచి నోట్ల కట్టలు బయటికి తీసి… వాటిని మార్చుకుని మళ్లీ లాకర్లలో దాచుకున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే లాకర్లలో నగదు పెట్టకుండా ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తెచ్చినట్లు చెబుతున్నారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం…
లాకర్లలో నగలు వంటి విలువైన వస్తువులు, పత్రాలను మాత్రమే దాచుకోవాలి. కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామాగ్రి, మాదక ద్రవ్యాలు, నిషిద్ధ వస్తువులు, పాడైపోయే పదార్థాలు లేదా వస్తువులు.. రేడియా ధార్మిక వస్తువులు, బ్యాంకుకు లేదా ఖాతాదారులకు చేటు చేసే చట్ట విరుద్ధ వస్తువులు లాకర్లలో ఉంచడానికి వీల్లేదు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×