EPAPER

Lung Cancer : లంగ్ క్యాన్సర్‌కు కొత్త పిల్.. 50 శాతం బ్రతికే ఛాన్స్..!

Lung Cancer : లంగ్ క్యాన్సర్‌కు కొత్త పిల్.. 50 శాతం బ్రతికే ఛాన్స్..!
Lung Cancer


Lung Cancer : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల క్యాన్సర్లు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. చాలావరకు క్యాన్సర్ రకాలు ముందుగానే బయటపడితే.. పేషెంట్లకు ఏ హాని జరగకుండా వారిని బ్రతికించే బాధ్యతను డాక్టర్లు స్వీకరిస్తారు. కానీ క్యాన్సర్ ముందుగా బయటపడకుండా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బయటపడితే మాత్రం.. పేషెంట్ బ్రతికే అవకాశం చాలా తక్కువ. టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఇందులో మాత్రం ఏ మార్పు రాలేదు. కానీ తాజాగా లంగ్ క్యాన్సర్ నుండి పేషెంట్లను బ్రతికించే ఒక కొత్త పిల్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

లంగ్ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన క్యాన్సర్లలో ఒకటి. కానీ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టిన కొత్త పిల్.. లంగ్ క్యాన్సర్ వల్ల కలిగే మరణాన్ని 50 శాతం దూరం చేసే గ్యారంటీని ఇస్తుందని వారు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్‌పై గత దశాబ్దం నుండి క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. ‘ఆసిమెర్టినిబ్’ అనే ఈ పిల్‌ను తీసుకున్న తర్వాత లంగ్ క్యాన్సర్ నుండి పేషెంట్లు 51 శాతం తప్పించుకునే ఛాన్స్ ఉందని వారు కనిపెట్టారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ విషయం స్పష్టమయ్యింది కూడా.


క్యాన్సర్‌కు ఏ గ్యారంటీ లేని చికిత్స తీసుకోవడం కంటే ఇలా సగం గ్యారంటీ అయినా ఉన్న పిల్‌ను తీసుకోవడం బెటర్ అని కొందరు పేషెంట్లు భావిస్తున్నారు. ‘టాగ్రిస్సో’ అని పిలవబడే ఈ ఆసిమెర్టినిబ్.. చాలా కామన్ రకమైన లంగ్ క్యాన్సర్‌కు మందుగా పనిచేస్తుంది. ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 1.8 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 30 ఏళ్ల క్రితం.. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని సమయంలో దీని గురించి శాస్త్రవేత్తలు కూడా ఏమీ చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు దీనికి చికిత్సను కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

క్యాన్సర్ అనే కాదు.. ఏ ప్రాణాంతక వ్యాధి విషయంలో అయినా చికిత్స అనేది 50 శాతం ఛాన్స్ ఇస్తుంది అంటే అది చాలా పెద్ద విషయమే అని వైద్యులు అంటున్నారు. అది కూడా లంగ్ క్యాన్సర్ లాంటి మరింత భయంకరమైన వ్యాధి విషయంలో 50 శాతం ఛాన్స్ ఉన్న మందును కనిపెట్టడం వారికి మొదటి సక్సెస్‌గా భావిస్తున్నామని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లంగ్ క్యాన్సర్ అనేది మామూలుగా థెరపీలతో పూర్తిస్థాయిలో నయం అయ్యే వ్యాధి కాదు కాబట్టి దానికి ఇలాంటి పిల్ అవసరమని వారు ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టినట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 26 దేశాల్లో 30 నుండి 86 మధ్య వయసు ఉన్న లంగ్ క్యాన్సర్ పేషెంట్లపై టాగ్రిస్సో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ పిల్ వెంటనే మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది లంగ్ క్యాన్సర్ కేర్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించనుందని వారు భావిస్తున్నారు. లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత, ఆ ట్యూమర్‌ను వారి లంగ్స్ నుండి తీసేసిన తర్వాత ఈ పిల్స్‌కు రెగ్యులర్‌గా అయిదు సంవత్సరాలు ఉపయోగించిన 88 శాతం మంది పేషెంట్లు ఇంకా ఆరోగ్యంగా బ్రతికే ఉన్నారని వారు బయటపెట్టారు.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×