EPAPER
Kirrak Couples Episode 1

NASA Pic of Chandrayaan 3 : జాబిల్లిపై ల్యాండర్ విక్రమ్.. ఫోటో తీసిన నాసా ఉపగ్రహం..

NASA Pic of Chandrayaan 3 : జాబిల్లిపై ల్యాండర్ విక్రమ్.. ఫోటో తీసిన నాసా ఉపగ్రహం..

NASA tweet on Chandrayaan 3 today(Telugu flash news) :

చంద్రయాన్‌-3 ప్రయోగంపై మరో ఆసక్తికర వార్త వచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ దిగినప్పటి నుంచి వాటి పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్రో అందించింది. చంద్రుడిపై 14 రోజులపాటు ల్యాండర్ , రోవర్ తమ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. జాబిల్లిపై చీకటి పడటంతో విక్రమ్, ప్రజ్ఞాన్ ను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపింది. మళ్లీ చంద్రుడిపై 14 రోజులకు వెలుగు వస్తుంది. ఆ తర్వాత వాటి భవితవ్యంపై క్లారిటీ వస్తుంది.


మరోవైపు తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా.. చంద్రయాన్‌-3 పై అప్ డేట్ ఇవ్వడం ఆసక్తిని రేపింది. ల్యాండర్‌ విక్రమ్ ఫోటోను నాసా ట్విటర్‌లో షేర్ చేసింది. తమ ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు పేర్కొంది. జాబిల్లి ఉపరితలంపై ఉన్న ల్యాండర్‌ విక్రమ్ ను నాసాకు చెందిన లునార్‌ రికానజెన్స్‌ ఆర్బిటర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ఈ ఫోటో తీసింది. ఆగస్టు 23న ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో దిగిందని నాసా వివరించింది. ల్యాండర్ దిగిన 4 రోజుల తర్వాత ఆగస్టు 27న LRO స్పేస్ క్రాఫ్ట్ ఫోటో తీసింది.

జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల తెల్లని వలయం ఏర్పడిందని ఈ చిత్రాలను బట్టి తెలుస్తోంది. చంద్రుడి ఉపరితలం 3-డీ అనాగ్లిఫ్‌ చిత్రాన్ని ఇస్రో సెప్టెంబర్ 5న విడుదల చేసింది. అందులో విక్రమ్‌ ల్యాండర్‌ ఉన్న ప్రాంతంలో జాబిల్లి ఉపరితలం స్పష్టంగా కనిపించింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌కు అమర్చిన నేవిగేషన్‌ కెమెరాలతో తీసిన చిత్రాలను ప్రత్యేక పద్దతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో వివరించింది. స్టీరియో లేదా మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి 3 కోణాల్లో కనిపించేలా చేయడాన్ని అనాగ్లిఫ్‌ అంటారు.


ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉన్న ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 22న తిరిగి ఆన్ అవుతాయని ఇస్రో భావిస్తోంది. ల్యాండర్ , రోవర్ మళ్లీ పని చేస్తే చంద్రుడిపై మరికొన్ని రోజులు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

Related News

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Big Stories

×