EPAPER

NASA:-అంతరిక్షంలో హార్ట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం..

NASA:-అంతరిక్షంలో హార్ట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం..

NASA:-ఈరోజుల్లో స్పేస్ గురించి పూర్తిగా స్టడీ చేయడానికి కేవలం శాటిలైట్లే, స్టార్‌షిప్స్ మాత్రమే అంతరిక్షానికి వెళ్లడం కాకుండా.. ఆస్ట్రానాట్స్ కూడా వెళ్తే బెటర్ అని చాలా దేశాల స్పేస్ సెంటర్లు ఆలోచిస్తున్నాయి. అందుకే త్వరలోనే ఎంతోమంది ఆస్ట్రానాట్స్ అంతరిక్షానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే వారితో పాటు వారికి అవసరమయ్యే పరికరాలను, కమర్షియల్ సప్లైలను స్పేస్‌కు పంపిచడానికి నాసా సిద్ధమవుతోంది.


ఇప్పటికే నాసా ఎన్నోసార్లు కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ (సీఆర్ఎస్) మిషిన్‌ను అంతరిక్షానికి పంపింది. ఇప్పుడు కూడా మరోసారి ఈ మిషిన్ గాలిలోకి ఎగరడానికి సిద్ధమయ్యింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి సీఆర్ఎస్‌ను మార్చ్‌లో లాంచ్ చేయడానికి ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ లాంచ్ చేయనుంది. ఈసారి సీఆర్ఎస్‌లో ఆకాశానికి వెళ్లే పరికరాలు.. అక్కడి హార్ట్ రేట్‌ను తెలుసుకోవడానికి పనిచేస్తాయి. అంతే కాకుండా కెమెరా మౌంట్‌ను టెస్ట్ చేయడానికి, బయోఫిల్మ్ ఫార్మేషన్‌ను గమనించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

టిష్యూ చిప్స్ ద్వారా అంతరిక్షంలో హార్ట్ రేట్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన కొత్త స్టడీ ఈసారి అంతరిక్షంలో ప్రయోగించబడుతుంది. కార్డినల్ హార్ట్ 2.0 అనే టెక్నాలజీ కార్డినల్ హార్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ హార్ట్ రేట్‌పై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుందని, అందుకే అక్కడ హార్ట్ రేట్‌ను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం హార్ట్ రేట్‌ను మాత్రమే కాదు.. ఊపిరితిత్తులను స్టడీ చేయడానికి కూడా ఒక టెక్నాలజీ సిద్దమయ్యిందని వారు తెలిపారు.


స్పైస్‌లో హార్ట్ సెల్స్.. డ్రగ్స్‌కు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాన్ని బట్టి భూమిపై కూడా గుండె సమస్యలు ఉన్నవారికి ఎలాంటి మందులు అందించాలో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా టిష్యూలపై జరిగే ఈ ప్రయోగం ముందుగానే గుండెపోటులాంటి సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడుతుందని వారు అన్నారు. మార్చ్‌లో సీఆర్ఎస్ అంతరిక్షంలోకి ఎగిరిన తర్వాత ఈ ప్రయోగాలపై మరిన్ని అప్డేట్స్ అందనున్నాయి.

సైకాలజికల్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు..!

for more updates follow this link:-bigtv

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×