EPAPER

Nasa Artemis 1 :మరో 6 రోజుల్లో చంద్రుడి యాత్ర ముగించనున్న ఆర్టెమిస్ 1

Nasa Artemis 1 :మరో 6 రోజుల్లో చంద్రుడి యాత్ర ముగించనున్న ఆర్టెమిస్ 1

Nasa Artemis 1 : చంద్రుడిపైకి మనుషులను పంపే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా నాసా ప్రయోగించిన మానవరహిత ఆర్టెమిస్ 1 ఓరియన్ క్యాప్సూల్ మరో 6 రోజుల్లో అంటే డిసెంబర్ 11న భూమికి తిరిగిరానుంది. నవంబర్ 16న నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ -ఎస్.ఎల్.ఎస్. అనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుడిపైకి పంపింది. జాబిల్లిపైకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉంది ఓరియన్ స్పేస్ క్యాప్సూల్. దీని మొత్తం జర్నీ ఇరవై ఐదున్నర రోజులు. ఈ నెల 11న కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ అవుతుంది. భూమిపైకి తిరుగు ప్రయాణం మొదలు పెట్టే ముందు 10 చిన్న ఉపగ్రహాలను వదలిపెట్టింది. ఇవి చంద్రుడి దక్షిణ ధ్రువంపై మంచును గుర్తించడం వంటివి చేస్తుంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే ఆర్టెమిస్ ప్రాజెక్టుల్లో మనుషులు దక్షిణ ధ్రువంపైనే అడుగు పెట్టనున్నారు. నాసా దీని కోసం 4.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఓరియన్ క్యాప్సూల్ తిరిగి భూమికి చేరడంతో ఆర్టెమిస్ 1 ప్రయోగం పూర్తవుతుంది. అయితే ఇప్పటికే చంద్రుడి పైకి వెళ్లొచ్చిన ఈ స్పేస్ షిప్… నవంబర్ 21న అక్కడి ఫొటోలను, వీడియోలను పంపింది. సెకనుకు 160 కిలోమీటర్ల వేగంతో చంద్రుడివైపు దూసుకెళ్లింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఇది గంటకు దాదాపు 39,400 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములు భూమిపైకి వచ్చే వేగం కన్నా ఇది చాలా ఎక్కువ. అయితే ఇది భూమిపైకి వచ్చేటప్పుడు దీనిపై ఉన్న షీల్డ్ కు నిజంగా అగ్నిపరీక్షే. ఎందుకంటే భూమి వాతావరణంలోని సుమారు 5000 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతలను తట్టుకోవల్సి ఉంటుంది. ఇక ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్ 2 ను ప్రయోగించనుంది నాసా. అందులో నలుగురు వ్యోమగాములను పంపిస్తారు. అయితే వారంతా చంద్రుడిపై కాలుమోపకుండా మూన్ ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో జాబిల్లిని చుట్టి వస్తారు. ఇది సక్సెస్ అయితే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యధిక దూరంగా రికార్డులకు ఎక్కనుంది. అది కూడా సక్సెస్ అయితే… 2025లో ఆర్టెమిస్ 3 ప్రయోగం చేపడతారు. అందులో ఒక మహిళతోపాటు నలుగురు ఆస్ట్రోనాట్స్ ని జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పంపిస్తారు. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అయిందంటే చంద్రుడిపై మనిషి నివాసానికి మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×