EPAPER

‘N.E.S.T’ సినిమా.. నెక్ట్స్ లెవల్లో రాణించనున్నదా..?

‘N.E.S.T’ సినిమా.. నెక్ట్స్ లెవల్లో రాణించనున్నదా..?

N.E.S.T’ Movie: ఇతర భాషల్లో రిలీజైన చాలా సినిమాలను తెలుగులో తీశారు. అవి చాలా హిట్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి కోవకు చెందిందే ‘N.E.S.T’ చిత్రం. ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తున్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినిమా రంగంలోని ప్రముఖుల నుంచి ఈ సినిమాపై ప్రశంసంల వర్షం కురుస్తున్నది. చాలా బాగా రూపొందించారంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. దీంతో తెలుగు సినిమా మార్కెట్లో ఈ సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తున్నది.


అయితే, యునైటెడ్ స్టేట్స్ -యూఎస్ లోని చాలా ప్రదేశాలల్లో ‘N.E.S.T’ చిత్రాన్ని షూట్ చేశారు. ఇంగ్లీష్ భాషలో తీసిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేశారు. ఫణి శివరాజు, పులి ధరణి, మణి శశాంక్ కొలిశెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. శరత్ సింగం ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. అయితే, ఈ సినిమాను నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రీమియర్ షోను వేసి చూపించారు.

ఈ ప్రీమియర్ షోను ఆ ప్రముఖులు మూవీ టీమ్ కంగ్రాట్స్ చెప్పారు. ఈ సినిమాలో నటించిన నటీనటులను ప్రశంసించారు. చిత్రం చాలా బాగుందని చెప్పారు. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు. ఆడియన్స్ అంతా లీనమై చూసేలా ఈ సినిమాను రూపొందించారన్నారు. అంతేకాదు.. ఆడియన్స్ పై ఈ సినిమా కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నారు.


Also Read: ఈసారి మగపిల్లాడు పుడితే చంపేస్తా.. మగజాతిని కాపాడేవారే లేరా..?

కథ, స్క్రీన్ ప్లే వినూత్నంగా ఉందన్నారు. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమాను తీసినట్టుగా ఉందంటూ ప్రముఖులు తెగ సంబురపడిపోతున్నారు. ఇటు ఫణి శివరాజు, సుదీప్ తానేటి సారథ్యంలోని సినిమాటోగ్రఫీ, భరద్వాజ్ వెంకట ఆర్ఆర్ సినిమాకు అడిషనల్ ఆకర్షణగా నిలుస్తుందంటూ హింట్ ఇచ్చారు.

ఇక తారాగణం వివరాల్లోకి వస్తే.. మణి శశాంక్ కొలిశెట్టి, బద్రి కాలేపల్లి, ఫణి శివరాజు, పులి ధరణి, అను రవికుమార్, సంతోషి దామిడి, సుదీప్ తానేటి, ప్రసన్న పొన్నాల, సత్య చలసాని, అభిషేక్ రెడ్డి ఎల్లు, వినయ్ రెడ్డి కుంట, శ్రీపాల్ రెడ్డి, నితిన్ కృష్ణ పులివర్తి, రవికుమార్ పండరి, రేణు కాలేపల్లి తదితరులు ఉన్నారు.

సాంకేతిక సిబ్బంది వివరాలు..
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శరత్ సింగం
డీఓపీ – ఫణి శివరాజు, సుదీప్ తానేటి
ఎడిటింగ్ – కార్తీక్ పల్లె
నేపథ్య సంగీతం – భరద్వాజ్ వెంకట
డీఐ – గణేష్ కొమ్మరపు
పీఆర్ఓ – సాయి సతీష్

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×