EPAPER

Musk : ట్విట్టర్ కొనేశానని సింబాలిక్ గా చెప్పిన మస్క్

Musk : ట్విట్టర్ కొనేశానని సింబాలిక్ గా చెప్పిన మస్క్

Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనడం దాదాపు ఖాయమైంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లిన మస్క్… చేతులు కడుక్కునే సింక్ పట్టుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నవ్వుతూ లోపలికి వెళ్తూ… ‘లెట్‌ దట్‌ సింక్‌ ఇన్‌’ అని వ్యాఖ్యానించారు. తాను ట్విట్టర్ తో సింక్ అవుతున్నానని సింబాలిక్ గా చెప్పేందుకే ఆయన అలా కనిపించారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు… తన ట్విటర్‌ బయోను ‘చీఫ్‌ ట్విట్‌’గా మార్చారు… మస్క్. ట్విట్టర్ డీల్ పూర్తి చేసేందుకు అక్టోబర్ 28 వరకు కోర్టు గడువు ఇవ్వడంతో… ఆలోగానే ట్విట్టర్ ను కొనబోతున్నారు… మస్క్. 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకోబోతున్న మస్క్… డీల్ పూర్తి చేసేందుకు 46.5 బిలయన్ డాలర్లను ఈక్విటీ, రుణాల రూపంలో సిద్ధం చేసుకున్నారు. అందులో బ్యాంకర్ల నుంచి 13 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకున్నారు. ఇక ఈక్విటీ పెట్టుబడిదారులు 7.1 బిలియన్ డాలర్లు అందించారు.


మరోవైపు… ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత 75 శాతం మంది ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలుకుతాడనే వార్తల నేపథ్యంలో… చాలా మంది ఉద్యోగులు ముందుగానే ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్లు… ఓ సంస్థ వెల్లడించింది. ఈ నెలలో ఇప్పటికే 50 మంది కీలక ఉద్యోగులు రాజీనామా చేశారని చెబుతోంది. గత జనవరి నుంచి 11 వందల మంది ట్విట్టర్ ను వీడారని వెల్లడించింది. వారికి గూగుల్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు ఆహ్వానం పలికాయని పేర్కొంది. మరికొందరు ఇతర సంస్థలు లాగేశాయని చెబుతోంది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×