BigTV English

Mrunal Thakur:క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘సీతారామం’ బ్యూటీ!

Mrunal Thakur:క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘సీతారామం’ బ్యూటీ!

Mrunal Thakur:గ‌త ఏడాది విడుద‌లైన సీతారామం చిత్రంలో సీత‌గా తెలుగు వారి హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది బెంగాళీ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు హిందీ, తెలుగు సినిమాల్లోనే న‌టిస్తుంది. సీతారామం త‌ర్వాత మృణాల్ న‌టిస్తోన్న మ‌రో తెలుగు మూవీలో నాని హీరోగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతుంది. ఈ సినిమా త‌ర్వాత మృణాల్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ అది చిన్నా చిత‌కా మూవీ కాదు..ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనేన‌ట‌. ఇంత‌కీ హీరో ఎవ‌రో తెలుసా? మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అని అంటున్నారు.


వివ‌రాల్లోకి వెళితే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ రెండు క్రేజీ సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. అవి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒక‌టి శంక‌ర్‌తో చ‌ర‌ణ్ చేస్తోన్న RC 15. ఈ మూవీ ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మే నెల‌కంతా షూటింగ్‌ను పూర్తి చేసేస్తార‌ట‌. త‌ర్వాత RC 16ను బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేయాల‌ని చ‌ర‌ణ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా అనుకున్నార‌ని, ఆమెకు కూడా చెప్పేశార‌ని, ఆమెకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని టాక్‌.

మ‌రో వైపు బుచ్చిబాబు చ‌ర‌ణ్ సినిమాపై చాలా ఫోక‌స్‌గా ఉన్నాడు. ఎందుకంటే ద్వితీయ విఘ్నం అనేది టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను వెంటాడుతున్న సెంటిమెంట్ దాన్ని దాటాలి. మరో రీజ‌న్ ఏంటంటే బుచ్చి బాబు ఉప్పెన‌.. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. కానీ చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌ట‌మంటే అంత ఈజీ కాదు.. అది కూడా పాన్ ఇండియా మూవీ అంటే అంచ‌నాలు ఆకాశాన్నంటుతుంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే పక్కా స్క్రిప్ట్ రెడీ చేయాలి. కాబ‌ట్టి బుచ్చి బాబు దానిపై వ‌ర్క్ చేస్తున్నాడు.


Astrologer Venu Swamy:తార‌క‌ర‌త్న చ‌నిపోతాడ‌ని ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామికి ముందే తెలుసా?

Pathaan: టాప్ 5లో ‘పఠాన్’… మ్యాజిక్ చేసిన షారూఖ్

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×