EPAPER
Kirrak Couples Episode 1

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

India reports first case of Clade 1 variant of Monkeypox Virus: దేశ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. గత కొన్ని రోజులుగా మంకీపాక్స్ కేసులు ఒక్కొక్కటి పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఐదేళ్ల కిందట కరోనా కేసులు కూడా ఇలాగే ఒకటి.. రెండు.. మూడు అంటూ పెరుగుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కాంగో సహా పలు దేశాలను కలవరపెడుతున్న ఈ మంకీపాక్స్.. తాజాగా, భారత్‌లోనూ వ్యాపిస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వణుకు పుట్టిస్తుంది.


దేశంలో మంకీపాక్స్ తొలి కేసు సెప్టెంబర్ 9న నమోదైంది. ఆ తర్వాత రెండో కేసు 9 రోజుల తర్వాత సెప్టెంబర్ 18న నమోదు అయింది. అయితే తాజాగా, 5 రోజుల వ్యవధిలోనే మూడో కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం 15 రోజుల్లోనే మూడు కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. సోమవారం దుబాయ్ నుంచి ఓ వ్యక్తి కేరళకు వచ్చాడు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పడంతో అనుమానంతో అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కేరళకు చెందిన 38ఏళ్ల బాధితుడి రక్తంలో క్లాడ్ 1బీ రకం వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు కారణమైన ఈ ‘మంకీపాక్స్ క్లాడ్ 1బీ‘ రకం వైరస్ తొలి కేసు భారత్‌లోనూ వెలుగుచూసింది. దీంతో అధికారులు ఆయనను ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.


మలప్పురానికి చెందిన బాధితుడు యూఏఈ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. తొలత స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి చేరిన తర్వాత అక్కడినుంచి మంజేరి మెడికల్ కాలేజీకి తరలించగా.. అక్కడ లక్షణాలను పరిశీలించి మంకీపాక్స్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అతడి నుంచి నమూనాలు సేకరించి కోజికోడ్ మెడికల్ కాలేజికి పంపారు. నమూనాలను పరీక్షించగా.. మంకీపాక్స్‌గా నిర్ధారణ అయింది.

కాగా, బాధితుడు ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈ మేరకు కేరళ వైద్య మంత్రిత్వశాఖ వర్గాలు అధికారులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వస్తున్న ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాధితులు కుటుంబ సభ్యులకు సోకకుండా ఐసోలేట్ కావాలని చెప్పారు. వెంటనే చికిత్స చేయించుకొని త్వరగా ఈ కేసుల నుంచి విముక్తి పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

అంతకుముందు, హర్యానాలో 26 ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ కేసు నమోదైంది. అయితే అతడికి క్లాడ్ 2 రకం వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ ప్రమాదకరమైనది కాకపోవడంతో అతడికి చికిత్స అందించి కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ మంకీపాక్స్ వైరస్‌లో రెండు రకాలు ఉంటాయి. క్లాడ్ 1రకం.. క్లాడ్ 2 రకం ఉంటాయి. ఇందులోనూ సబ్ క్లాడ్‌లు 1ఏ, 1 బీ, 2ఏ, 2బీ ఉంటాయి. కాంగోతోపాటు పలు దేశాల్లో 1ఏ, 1బీ క్లాడ్‌ల కేసుల పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Related News

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Big Stories

×